Sunday, November 17, 2024

ఆహా.. కాంగ్రెస్‌లో ఎంత మార్పు?

* 48 గంటల్లో సీఎం పేరు ఖ‌రారు..

తెలంగాణ రాష్ట్ర ప్ర‌జ‌లు కాంగ్రెస్‌కు స్ప‌ష్ట‌మైన మెజార్టీ ఇచ్చిన 48 గంట‌ల్లోనే సీఎల్పీ నాయ‌కుడిని, తెలంగాణ ముఖ్య‌మంత్రి పేరును ప్ర‌క‌టించింది. ఢిల్లీ లాబియింగ్‌కు కాలం చెల్లింది. కేవ‌లం తెలంగాణ అభిమ‌తాన్ని ప‌రిగ‌ణ‌లోకి తీసుకున్న కాంగ్రెస్ అధిష్ఠానం రేవంత్ రెడ్డిని ముఖ్య‌మంత్రిగా నిర్ణ‌యించింది. ఈ నెల 7వ తేదీన ముఖ్యమంత్రి గా రేవంత్ రెడ్డి ప్ర‌మాణ స్వీకారం చేస్తారు. పార్టీ అధ్య‌క్షుడి నిర్ణ‌యాన్ని మీడియా వేదిక‌గా కేసీ వేణుగోపాల్ మంగ‌ళ‌వారం సాయంత్రం ప్ర‌క‌టించారు. కాంగ్రెస్ పార్టీలో ప్ర‌జాస్వామ్యం ఉంద‌ని చెప్ప‌డానికి నిద‌ర్శ‌న‌మిదే. బీఆర్ఎస్ పార్టీలో సీఎం కేసీఆర్ చెప్పిందే వేదం. కానీ, ఇక్క‌డ కాంగ్రెస్ పార్టీ కార్య‌క‌ర్త‌ల మ‌నోగ‌తాన్ని ప‌రిగ‌ణ‌లోకి తీసుకుంటుంది. ఇదే కాంగ్రెస్ ప్ర‌త్యేక‌త‌. అందుకే, ప్ర‌జ‌లు తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని ఎన్నుకున్న విష‌యం తెలిసిందే.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

బోనస్ ఇచ్చి ధాన్యం కొంటున్నట్టు రేవంత్ రెడ్డి మహారాష్ట్రలో గప్పాలు కొట్టాడు అన్న హరీశ్ రావు వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..!
- Advertisment -

Most Popular