Wednesday, September 18, 2024

వైభవంగా యజ్ఞ ట్రైలర్ లాంఛ్

సుభాష్ రావ్ దేశ్ పాండే సమర్పణలో ప్రదీప్ రెడ్డి, శివ నాయుడు, గోవా జ్యోతి హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా యజ్ఞ. ఈ చిత్రంలో సుమన్ శెట్టి, జబర్దస్త్ అప్పారావు, చిట్టి బాబు, చెన్నకేశవ నాయుడు, ఆవిష్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఆర్.ఆర్.మూవీ క్రియేషన్స్, రేణుక ఎల్లమ్మ ఫిలింస్ బ్యానర్స్ పై చిలుకోటి రఘురాం, చీలపల్లి విఠల్ గౌడ్ నిర్మిస్తున్నారు. హారర్ కామెడీ కథతో దర్శకుడు చిత్తజల్లు ప్రసాద్ యజ్ఞ సినిమాను రూపొందిస్తున్నారు. త్వరలో ఈ సినిమా గ్రాండ్ గా పి అర్ కె ఫిలింస్ ద్వారా రిలీజ్ కు రెడీ అవుతోంది. తాజాగా యజ్ఞ సినిమా ట్రైలర్ రిలీజ్ కార్యక్రమం హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో జరిగింది.

ఈ కార్యక్రమంలో నిర్మాత ఆర్కే గౌడ్ మాట్లాడుతూ – యజ్ఞ సినిమా ప్రారంభోత్సవం కూడా మా చేతుల మీదుగానే జరిగింది. ప్రొడ్యూసర్ విఠల్ గౌడ్ మా టీఎఫ్ సీసీ లో సభ్యుడు. హారర్ కామెడీతో రూపొందించిన ఈ సినిమా ట్రైలర్ ఆకట్టుకునేలా ఉంది. పాటలు బాగున్నాయి. సినిమా రిలీజ్ టైమ్ లో కూడా ఏ హెల్ప్ కావాలన్నా నా వంతు సహకారం అందిస్తాను. యజ్ఞ సినిమా హిట్ కావాలని కోరుకుంటున్నా అన్నారు. దర్శకుడు చిత్తజల్లు ప్రసాద్ మాట్లాడుతూ – యజ్ఞ సినిమాను కంప్లీట్ చేసేందుకు పెద్ద యజ్ఞమే చేశాం. మొదట సినిమా ప్రారంభించినప్పుడు ఉన్న ప్రొడ్యూసర్ షూటింగ్ టైమ్ కు వెళ్లిపోయాడు. ఆ తర్వాత నేను బాధపడుతుంటే నా స్నేహితుడు రఘురాం, విఠల్ గారు, సుభాష్ రావు గారు నిర్మాణ బాధ్యతలు తీసుకున్నారు. వీళ్లు దేవుళ్లులా రాకుంటే నా సినిమాను రిలీజ్ అయ్యేది కాదు. ఎన్నో అవాంతరాలు ఎదుర్కొన్నాం. లేకుంటే గతేడాదే యజ్ఞ సినిమా విడుదలయ్యేది. క్యూబ్ లు యూఎఫ్ లో చిన్న సినిమాలకు భారంగా మారుతున్నాయి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

ప్రకాశం బ్యారేజీని బోట్లు ఢీకొట్టడం కుట్రే... ఇందులో జ‌గ‌న్ పాత్ర ఉంది అన్న వర్ల రామయ్య వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular