Tuesday, December 24, 2024

యముడు ఫస్ట్ లుక్

జగన్నాధ పిక్చర్స్ పతాకంపై జగదీష్ ఆమంచి హీరో గా నటిస్తూ స్వీయ దర్శకత్వం వహించిన చిత్రం “యముడు”. ధర్మో రక్షతి రక్షిత అనే ఉప శీర్షిక తో వస్తున్నా థ్రిల్లర్ చిత్రం షూటింగ్ అంత పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీ గా ఉంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని డిసెంబర్ మాసంలో ఈ చిత్రాన్ని విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రం లో శ్రావణి శెట్టి హీరోయిన్ గా నటించింది మరియు ఆకాష్ చల్లా రెండో హీరో గా నటించాడు.
అయితే సినిమా ప్రమోషన్ లో భాగంగా ఈ చిత్రం యొక్క ఫస్ట్ లుక్ పోస్టర్ ను ప్రముఖ నిర్మాత రాజ్ కందుకూరి చేతుల మీదుగా విడుదల చేశారు. ఫస్ట్ లుక్ విడుదల అనంతరం నిర్మాత రాజ్ కందుకూరి మాట్లాడుతూ “యముడు చిత్రం ఫస్ట్ లుక్ విడుదల చేయడం చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడే కథ విన్నాను, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. మంచి కథ, ప్రేక్షకులకి ఖచ్చితంగా నచ్చుతుంది. ఈ రోజుల్లో ప్రేక్షకులు చిన్న సినిమా, కొత్త సినిమా అని చూడటం లేదు. కథ బాగుంటే సూపర్ హిట్ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని జగదీష్ ఆమంచి బాగా చేసుంటారు అని నమ్ముతున్నాను. మంచి హిట్ కావాలి” అని కోరుకున్నారు.

హీరో, దర్శకుడు నిర్మాత జగదీష్ ఆమంచి మాట్లాడుతూ “మా యముడు చిత్రం ఫస్ట్ లుక్ ను విడుదల చేసిన నిర్మాత రాజ్ కందుకూరికి ధన్యవాదాలు. మా చిత్ర కథ విషయానికి వస్తే సామాన్య ధర్మం పాటించకుండా సమాజానికి కీడు చేసే వాళ్ళకి యముడు ప్రత్యక్షమై గరుడ పురాణం ప్రకారం శిక్షలు వేస్తుంటాడు. యముడు ఎందుకు ఆలా చేస్తాడు చివరికి ఏమవుతుంది అనేదే చిత్ర కథ. 2005 లో శంకర్ దర్శకత్వం లో హీరో విక్రమ్ నటించిన అపరిచితుడు చిత్రం లగే అదే కాన్సెప్ట్ లో మా చిత్రం కూడా ఉంటుంది. తెలుగు ప్రేక్షకులందరికీ మా యముడు చిత్రం నచ్చుతుంది” అని తెలిపారు.

ప్ర‌దాన వార్త‌లు

దురుద్దేశంతోనే తనపై కేసు పెట్టారన్న కేటీఆర్ వ్యాఖ్యలను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com