Tuesday, February 4, 2025

ముగ్గురు భామల మధ్య యశ్‌

రాక్‌స్టార్‌ యశ్‌ ఈ పేరు తెలియని వారుండరు. ప్రస్తుతం ఆయన గీతూ మోహన్‌ దాస్‌ దర్శకత్వంలో భారీ కాన్వాయ్‌పై `టాక్సిక్` తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే. డ్ర‌గ్స్ మాఫియా నేప‌థ్యంలో తెర‌కెక్కుతోన్న చిత్ర‌మిది. ఇప్ప‌టికే రిలీజ్ అయిన య‌శ్ లుక్ ప్ర‌తీది అంచనాలు పెంచేస్తుంది. కియారా అద్వానీ, న‌య‌న‌తార లాంటి స్టార్ హీరోయిన్లు న‌టిస్తున్నారు. ఇప్ప‌టికే మూడు షెడ్యూళ్ల షూటింగ్ కూడా పూర్త‌యింది. తాజాగా సినిమాకి సంబంధించి మ‌రో ఇంట్రెస్టింగ్ అప్ డేట్ వైర‌ల్ అవుతుంది. బెంగుళూరులో నాల్గ‌వ షెడ్యూల్ కూడా మొద‌లైన‌ట్లు తెలుస్తోంది. ఈ షెడ్యూల్ తో న‌య‌న‌తార‌, హ్యూమాఖురేషీ, తారా సుతారియా సెట్స్ లోకి అడుగు పెట్టారట‌. ముగ్గురిపై కొన్ని కాంబినేష‌న్ స‌న్నివేశాలు చిత్రీక‌రిస్తున్నారట‌. అయితే వాళ్ల ముగ్గురి మ‌ధ్య‌లో య‌శ్ ఉన్నాడా? లేడా? అన్న‌ది తెలియాల్సి ఉంది. అలాగే ఇదే షెడ్యూల్ లో యశ్ స‌హా ప్ర‌ధాన తార‌గ‌ణంపై మ‌రికొన్ని కీల‌క స‌న్నివేశాలు చిత్రీక‌రించ‌నున్నార‌ని స‌మాచారం. న‌య‌న్, ఖురేషీ, తార మ‌ధ్య వ‌చ్చే ఈ స‌న్నివేశాలు ఎంతో స్టైలిష్ గా ఉంటాయ‌ట‌. ఇక్క‌డే మ‌రో క్లారిటీ కూడా వ‌స్తుంది. ఈ సినిమాలో క‌రీనా క‌పూర్ కూడా న‌టిస్తుంద‌నే ప్రచారంలో ఉంది. కానీ హ్యూమా ఖురేషీ ఎంట‌ర్ అయిన నేప‌థ్యంలో క‌రీనా చిత్రంలో లేన‌ట్లే క‌నిపిస్తోంది. వాస్త‌వానికి క‌రీనా పేరే ముందుగా తెర‌పైకి వ‌చ్చింది. కానీ పారితోషికం విష‌యంలో పొంత‌న కుద‌ర‌క‌పోవ‌డంతో ఆమె త‌ప్పుకుంద‌నే ప్ర‌చారం జ‌రిగింది.

ప్ర‌దాన వార్త‌లు

తెలంగాణపై బీజేపీకి చిత్తశుద్ధి లేదని తేలిపోయిందన్న కవిత వ్యాఖ్యలను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com