- టిడిపిలో చేరిన వైసిపి నాయకుడు మాదాల తిరుపతిరావు యాదవ్
- పార్టీ కండువా కప్పి స్వాగతం పలికిన ఎంపి కేశినేని శివనాథ్
విజయవాడ : జగన్ పాలన లో రాష్ట్రం తిరోగమనం పాలైంది…సొంత పార్టీ నేతలనే వైసిపి పెద్దలు ఇబ్బందులకు గురి చేశారు. ఆ విషయం గ్రహించిన వైసిపి నాయకులు ఎన్డీయే కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి చూసి టిడిపి పార్టీ వైపు ఆకర్షితులవుతున్నారని ఎంపి కేశినేని శివనాథ్ అన్నారు.
పశ్చిమ నియోజకవర్గం 43 వ డివిజన్ లో వైసిపి నాయకుడు మాదాల తిరుపతి రావు యాదవ్ టిడిపి తీర్ధం పుచ్చుకున్నారు. ఆయన ఆధ్వర్యంలో మద్దతుదారులు బారీ సంఖ్యలో టిడిపిలో చేరారు. ఎంపి కేశినేని శివనాథ్, మాదాల తిరుపతి రావు యాదవ్ కి పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు..
ఈ సందర్బంగా ఎంపి కేశినేని శివనాథ్ మాట్లాడుతూ విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో టిడిపి బలమైన శక్తిగా తయారైందన్నారు. టిడిపికి కార్యకర్తలే బలమంటూ కార్యకర్తలను ఉత్సహపర్చారు. సీనియర్ నాయకులతో మమేకమై అందరూ కలసి ప్రజల కోసం పనిచేయాలని పిలుపునిచ్చారు.
అనంతరం ఎమ్.ఎస్ బేగ్ మాట్లాడుతూ విజన్ వున్న నాయకుడు సీఎం చంద్రబాబు అన్నారు.
టిడిపి పార్టీ లో కి వైసిపి నాయకులు చంద్రబాబు పై నమ్మకం తో. జాయిన్ అవుతున్నట్లు తెలిపారు.
మాదాల తిరుపతయ్య మాట్లాడుతూ వైసిపి కార్యకర్తలను వాడుకుని వదిలేస్తుందన్నారు. బిసి నేతగా ఆ పార్టీలోకి ఎన్నో అవమానాలు పడినట్లు తెలిపారు. తనతో సహా వైసిపి వీడి వంద మంది కార్యకర్తలు టిడిపిలొ చేరినట్లు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో డివిజన్ ప్రెసిడెంట్ మోరబోయిన రాంబాబు, టిడిపి నాయకులు ఉనికి కొండ,,ప్రసన్నలక్ష్మీ, ఖాలేషా, కొండయ్య, పూజల శ్రీనివాస్ లతో పాటు టిడిపి నాయకులు పాల్గొన్నారు.