వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్–దివ్వెల మాధురి ఎపిసోడ్ తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంలో తన భర్త తనకు కావాలంటూ దువ్వాడ శ్రీనివాస్ ఇంటి ముందు ఆయన భార్య వాణి, కూతురు ధర్నాకు దిగారు. మరోవైపు, దువ్వాడ శ్రీనివాస్ తో తన బంధాన్ని కొనసాగిస్తానని హాట్ కామెంట్స్ చేసిన మాధురి.. ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. కారులో ప్రయాణిస్తూ మరో కారును ఢీకొట్టింది. దీంతో ఆమె స్పల్వంగా గాయపడింది.
ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స తీసుకుని కోలుకున్న మాధురి.. తాజాగా తన ఆరోగ్యం మళ్లీ దెబ్బతిందని సోషల్ మీడియాలో వెల్లడించారు. ‘‘మీ అందరి సపోర్టుతో నాకు చాలా ధైర్యంగా ఉంది. ఇదే సపోర్టుతో ముందుకు వెళ్లాలని అనుకుంటున్నా. కానీ మళ్లీ ఆరోగ్య సమస్య వచ్చింది. డాక్టర్లు విశ్రాంతి తీసుకోవాలని చెప్పారు.. మాట్లాడలేకపోతున్నా. అందుకే కొద్దిరోజులు సోషల్‌మీడియాకు దూరంగా ఉండాలని అనుకుంటున్నా. మళ్లీ 10 రోజుల తర్వాత లైవ్‌కు వస్తాను’’ అని పేర్కొంది.