- యంగ్ ఇండియా స్కిల్ డెవలప్‌మెంట్ యూనివర్సిటీపై
- మండలిలో చర్చ సందర్భంగా సభ్యుల వెల్లడి
వృత్తితో పాటుగా నైపుణ్యత కల్పించబడాల్సిన అవసరం ఉందని ఎంఎల్‌సి జీవన్‌రెడ్డి తెలిపారు. శాసనమండలిలో శుక్రవారం ఉదయం 10 గంటలకు సమావేశాలు ప్రారంభమయ్యాయి. యంగ్ ఇండియా స్కిల్ డెవలప్‌మెంట్ యూనివర్సిటీపై చర్చ సంద ర్భంగా ఆయన మాట్లాడారు. నైపుణ్యం లోపించే పలువురు గల్ఫ్ బాట పట్టారన్నారు. భవన నిర్మాణ రంగంలో వివిధ విభాగాలకు పనిచేసే కార్మికులలో ఆయా విభాగాలకు సంబంధించిన దాంట్లో నైపుణ్యాన్ని పెంచాల్సిన అవసరం ఉందన్నారు. ప్రస్తుతం భవన నిర్మాణ రంగంలో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి పనిచేసే కార్మికుల సంఖ్య ఎక్కువగా ఉంటోందని వెల్లడించారు. ఈ క్రమంలో తెలంగాణలో ఉన్న భవన నిర్మాణ రంగ కార్మి కులకు నైపుణ్యత శిక్షణను పటిష్టం చేసే దిశగా చర్యలు చేపట్టాలని సూచించారు. స్కిల్ డెపలప్‌మెంట్ యూనివర్సిటీలో స్థానికులకే అవకాశం ఇవ్వాలని తద్వారా ఆశించిన లక్షం నెరవేరగలదన్నారు. మరో వైపు గల్ఫ్ కార్మిక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు. చదువుకునే చదువుకి, చేసే ఉద్యోగానికి నేడు పొంతన లేకుండా పోతోందని ఎంఎల్‌సి మధుసూదనాచారి అన్నారు. ఈ నేపథ్యంలో యంగ్ ఇండియా స్కిల్ డెవలప్‌మెంట్ యూనివర్సిటీని స్వాగతిస్తున్నామన్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా నైపుణ్య శిక్షను అలవర్చుకున్న నాడే ఆ లక్షం నెరవేరగలదన్నారు.
ఆ లక్ష సాధన దిశగా యూనివర్సిటీ సేవలందించగలదన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో యంగ్ ఇండియా స్కిల్ డెవలప్‌మెంట్ యూనివర్సిటీ పనిచేస్తుందని అంటున్నారని, అయితే, ఇందులో ప్రైవేటు వారి రోల్‌పై క్లారిటీ లేదని ఎంఎల్‌సి ఎవిన్‌రెడ్డి తెలిపారు. ఈ క్రమంలో ముందుగా సెలెక్ట్ కమిటీకి రిఫర్ చేస్తే బాగుండేదన్నారు. యువత దేశానికి అతి ముఖ్యమైన సంపద అని ఎంఎల్‌సి రఘోత్తమ్‌రెడ్డి అన్నారు. యూనివర్సిటీలో మంచి ఫ్యాకల్టీని తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. పరి శ్రమలతో యూనివర్సిటీని అనుసంధానం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటు చేయడం సంతోషకరమని, అయితే ఆ వర్సిటీలో రిజర్వేషన్లనూ ఇంప్లిమెంట్ చేయాల్సిన అవసరం ఉందని ఎంఎల్‌సి తీన్మార్ మల్లన్న పేర్కొన్నారు. దీని వలన నిమ్న వర్గాలకు మేలు జరుగుతుందన్నారు. ఉత్పత్తి, ఉపాధి రంగాల్లో వృద్ధి సాధించేందుకు ప్రభుత్వం యువతలో నైపుణ్యం పెంపొందిం చేందుకు స్కిల్ యూనివర్సిటీని అందుబాటులోకి తీసుకువస్తుందన్నారు. ఇతర దేశాలు స్కిల్స్‌లో ముందంజలో ఉన్నాయని, వాటిని ఢీ కొట్టేలా తెలంగాణ ప్రభుత్వం కొత్త విధానంలో నిర్ణయం తీసుకోవడం స్వాగతించదగిందన్నారు. అయితే గ్రామీణ ప్రాంతాల్లోనూ స్కిల్ డెవలప్ చేయా ల్సిన అవసరం ఉన్నదన్నారు.
ఇందుకోసం పాఠశాల నుంచే నైపుణ్యత కోర్సులను ప్రవేశపెట్టాలన్నారు. అప్పుడే క్షేత్రస్థాయిలోని విద్యార్ధులు, యువత వంద శాతం క్వాలిఫైడ్‌గా తీర్చిదిద్దబడతారన్నారు. యంగ్ ఇండియా స్కిల్ డెవలప్‌మెంట్ యూనివర్సిటీ మంచి నిర్ణయమని ఎంఎల్‌సి తక్కెళ్లపల్లి రవీందర్‌రావు అన్నారు. రాష్ట్రంలో యువకులు పనిచేయటం రాక ఇబ్బంది పడుతున్నారన్నారు. కావున యువతకు వారికి నచ్చిన రంగాల్లో శిక్షణనిచ్చి వాళ్ల కాళ్ల మీద వాళ్లు నిలబడి కుటుంబానికి, సమాజానికి ఉపయోగపడేలా తీర్చిదిద్దాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. యంగ్ ఇండియా స్కిల్ డెవలప్‌మెంట్ యూనివర్సిటీకి తాము పూర్తిస్థాయి మద్దతునిస్తున్నామని ఎంఎల్‌సి మీర్జా రియాజ్ ఉల్‌హసన్ ఎఫెండి అన్నారు. స్కిల్ అనేది రాత్రికి రాత్రి వచ్చేది కాదని ఎంఎల్‌సి దేశపతి శ్రీనివాస్ అన్నారు.
స్కూల్ ఎడ్యుకేషన్‌నుంచే స్కిల్‌పై అవగాహన పెంపొందించాలని సూచించారు. ఎవరికి ఏ రంగంలో అవగాహన వుందో ఆ రంగంలో వారికి నైపుణ్యత పెంపొందించేలా కృషి చేయాల్సిన అవసరం ఉందని ఎంఎల్‌సి భానుప్రసాద్ అన్నారు. యంగ్ ఇండియా స్కిల్ డెవలప్‌మెంట్ యూనివర్సిటీపై చర్చ సందర్భంగా సభ్యులు అందజేసిన సలహాలు, సూచనల తర్వాత మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడుతూ, సభ్యుల సూచనలు, సలహాలు పరిగణనలోనికి తీసుకుంటామని పేర్కొన్నారు. అదే విధంగా ఇది ప్రారంభమేనని, రానున్న కాలంలో జిల్లా, మండల స్థాయిలో స్కిల్ డెవలప్‌మెంట్ కార్యకలాపాల విస్తృతికి అనువైన చర్యలు తీసుకునే అవకాశం లేకపోలేదన్నారు. అనంతరం యంగ్ ఇండియా స్కిల్ డెవలప్‌మెంట్ యూనివర్సిటీ బిల్లు శాసన సభ ఆమోదం పొందింది.