Sunday, April 6, 2025

తెలంగాణలో క్రీడా విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం సిద్ధం

హకీంపేట్ లేదా గచ్చిబౌలిలో యంగ్‌ఇండియా స్పోర్ట్ యూనివర్శిటీ
ఈ యూనివర్శిటీలో స్పోర్ట్ మెడిసిన్, స్పోర్ట్ సైన్స్ సహా సుమారు డజనుకు పైగా కోర్సులు
స్పోర్ట్ యూనివర్శిటీని స్థాపనలో భాగస్వామిగా ఉండడానికి
దక్షిణ కొరియా కెఎన్‌ఎస్‌యూ అంగీకారం
ఆనంద్ మహీంద్రాకు ట్వీట్ చేసిన సిఎం రేవంత్

ప్రియమైన ఆనంద్ మహీంద్రా జీ, మీ మాటలు మనదేశం పట్ల ఉన్న ప్రేమ, భారతీయ యువతపై మీకు ఉన్న అపారమైన సామర్థ్యం, నమ్మకాన్ని చూస్తే తనకు ముచ్చటేస్తుందని ట్వీట్ వేదికగా సిఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్శిటీ (వైఐఎస్‌యూ)తో పాటు యంగ్ ఇండియా స్పోర్ట్ యూనివర్శిటీ అనే కాన్సెప్ట్‌పై పని చేస్తున్నానని సిఎం తెలిపారు. తాను ఇటీవల దక్షిణ కొరియాలో పర్యటించినప్పుడు కెఎన్‌ఎస్‌యూ (కొరియా నేషనల్ స్పోర్ట్ యూనివర్శిటీ) అధ్యక్షుడు మూన్ వాన్-జేతో సహా ఉన్నతస్థాయి ప్రతినిధి బృందాన్ని తాను కలుసుకున్నానని సిఎం రేవంత్ తెలిపారు.

కెఎన్‌ఎస్‌యూ, వైఐఎస్‌యూల మధ్య భాగస్వామ్యం కోసం తాము వివరణాత్మక చర్చలు జరిపామని, అందులో భాగంగా కెఎన్‌ఎస్‌యూ తెలంగాణలో ఏర్పాటు చేసే స్పోర్ట్ యూనివర్శిటీని స్థాపించడంలో భాగస్వామిగా ఉండటానికి సూత్రప్రాయంగా అంగీకరించిందని సిఎం రేవంత్ తెలిపారు. అందులో భాగంగా తెలంగాణలో క్రీడా విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని ఆయన తెలిపారు. హకీంపేట్ లేదా గచ్చిబౌలిలో యంగ్‌ఇండియా స్పోర్ట్ యూనివర్శిటీకి ప్రతిపాదించారని సిఎం రేవంత్ పేర్కొన్నారు. స్పోర్ట్ మెడిసిన్, స్పోర్ట్ సైన్స్ సహా సుమారు డజనుకు పైగా కోర్సులు ప్రవేశపెట్టాలని ప్రభుత్వం భావిస్తోందని సిఎం పేర్కొన్నారు. 72 గంటల్లోనే తాము హకీంపేట్‌లోని 200 ఎకరాల క్యాంపస్‌ను దీనికోసం గుర్తించామని ఆయన ట్వీట్‌లో రాసుకొచ్చారు.

ఇండియాకు పతకాలను తీసుకురావడానికి కృషి చేసే
ప్రస్తుతం ఉన్న అన్ని స్టేడియాల్లో సౌకర్యాలు కల్పించడంతో పాటు, తాము ఒలింపిక్స్-గ్రేడ్ నాణ్యత ఉండేలా వాటిని అప్‌గ్రేడ్ చేస్తామని సిఎం హామీనిచ్చారు. ఇటీవల ముగిసిన పారిస్ ఒలింపిక్స్‌లో మూడు బంగారు పతకాలు సాధించిన లిమ్ సిహ్యోన్‌ను తాను సత్కరించానని, తాను అనేక ఇతర ఛాంపియన్‌లను, కోచ్‌లతో కూడా సంభాషించానని ఆయన తెలిపారు. లాస్ ఏంజిల్స్ 2028 ఒలింపిక్స్‌లో మనదేశం, రాష్ట్ర తరపున పాల్గొనే క్రీడాకారులకు మౌలిక సదుపాయాలను రూపొందించడంలో తమకు సాయం చేయాలని ఆనంద్ మహీంద్రా ఆహ్వానిస్తున్నానని ఆయన తెలిపారు. భారతదేశానికి అనేక పతకాలను బహుమతిగా అందించడానికి మన రాష్ట్రంలోనే కాకుండా దేశంలోని యువత సామర్థ్యాన్ని తెలంగాణ ఉపయోగించుకోవాలని తాను కోరుకుంటున్నానని సిఎం రేవంత్ ట్వీట్ వేదికగా పేర్కొన్నారు.

ప్ర‌దాన వార్త‌లు

కేటీఆర్‌కు రాజకీయ ఓనమాలు తెలియవు.. అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్య లను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com