గద్వాల – ఎర్రవల్లిలో మద్యం మత్తులో ఓ యువకుడు పోలీస్ వాహనాన్ని ఎత్తుకెళ్లాడు. మద్యం మత్తు లో హల్ చల్ చేసి ఇబ్బంది పెడుతున్నాడని, ఓ కానిస్టేబుల్ పోలీసు వాహనాన్ని హైవే పక్కన నిలిపి.. ఆ యువకుడిని పక్కకు పంపించి, ట్రాఫిక్ క్రమబద్ధీకరణలో నిమగ్నమయ్యాడు.తర్వాత చూసేసరికి పెట్రోలింగ్ వాహనం అపహరణకు గురైంది.అయితే మద్యం మత్తులో ఆ యువకుడు వాహనాన్ని ఎత్తుకెళ్లినట్టు గుర్తించిన పోలీసులు తనిఖీలు చేపట్టగా కోదండపురంలో ఓ పెట్రోల్ బంక్ వద్ద వాహనాన్ని గుర్తించారు.