Wednesday, September 18, 2024

విమానం గాల్లో ఉండగా బాయ్‌ఫ్రెండ్‌కు ప్రపోజ్‌

విమానాల్లో జరిగే సంఘటనలు తరచూ వైరల్‌గా మారుతుంటాయి. కొట్టుకునే ఘటనలు ఉంటాయి.. తిట్టుకునే ఘటనలు ఉంటాయి. కొన్ని నవ్వులు కురిపిస్తే.. కొన్నయితే హృదయాలను కదిలించేస్తాయి. అటువంటి ఒక ఘటనే ఇండిగో విమానంలో చోటు చేసుకున్నది. ఆ ఘటన స్పెషాలిటీతో ఆ వీడియో వైరల్‌ అయింది. పాత చింతకాయ పచ్చడిలాంటి పద్ధతులు ఎందుకు అనుకున్నదేమో గానీ.. ఒక యువతి తన బాయ్‌ ఫ్రెండ్‌కు విమానం గాల్లో ఉండగా ప్రపోజ్‌ చేసి.. అతడిని ఆశ్చర్యానికి గురి చేసింది. సాధారణంగా యువకులు నీల్‌డౌన్‌ అయి ప్రపోజ్‌ చేస్తారు. దానికి భిన్నంగా ఆ యువతే మోకాళ్లపై కూర్చొని నన్ను పెళ్లి చేసుకుంటావా? అంటూ ఏంగేజ్‌మెంట్‌ రింగ్‌ బాక్స్‌ ఓపెన్‌ చేసి.. అతడి ముందుంచడంతో చుట్టుపక్కల చూస్తున్నవారంతా ఆశ్చర్యానికి గురయ్యారు. మనసు దోచుకున్నదంటూ వారిద్దరినీ అభినందించారు.

ఈ వీడియో ఆ యువతి తన బాయ్‌ఫ్రెండ్‌తో విమానంలో ఎక్కడంతో మొదలవుతుంది. కట్ చేస్తే.. మొత్తం ప్యాసింజర్లందరూ విమానం ఎక్కేస్తారు. ఫ్లైట్‌ అటెండెంట్‌ వారిద్దరి గురించి ఒక ఎనౌన్స్‌మెంట్‌ చేస్తారు. అప్పుడు ఆ యువతి తన బాయ్‌ఫ్రెండ్‌ వద్దకు వచ్చి.. ప్రపోజ్‌ చేస్తుంది. అతడు కూడా సంతోషంతో ఆమోదం తెలియజేస్తాడు. వెంటనే ఆ యువతి గుండెల నిండా నిండిన ప్రేమతో అతడి చేతికి ఉంగరం తొడిగుతుంది. అనంతరం వారిద్దరూ హత్తుకుని ముద్దు పెట్టుకుంటారు. ఈ వీడియోపై నెటిజన్లు పాజిటివ్‌గా స్పందించారు.

‘ఓ మై గాడ్‌.. నేను అనుకున్నదానికంటే ఇది ఎంతో బాగుంది. అందరూ చేసేదానికి భిన్నంగా అతడిని ఆశ్చర్యపర్చాలనుకున్నాను. అనుకోకుండా నా మైండ్‌లోకి ఈ ఆలోచన వచ్చింది. విమాన సిబ్బంది ఇందుకు అంగీకరిస్తారా? లేదా? అన్నది కూడా నాకు అప్పటికి తెలియదు. ఏం జరిగిందో మీరు చూశారుగా..’ అని రాస్తూ ఆ వీడియోను షేర్‌ చేసింది.

‘ఆకాశవీధిలో ప్రపోజల్‌, జీవితానికి అంకితం చేశా.. నా జీవిత భాగస్వామిని ఎంచుకున్నా’ అని ఆమె ఆ వీడియోకు క్యాప్షన్‌ జత చేసింది. ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేయగా.. దాదాపు 5 కోట్ల వ్యూస్‌ వచ్చాయి. లక్షల మంది లైకులు కొట్టారు. ‘యువరాణులకు లభించే ఉపచారాలను పురుషులు ఎందకు కోరుకుంటున్నారు?’ అని ఒక యూజర్‌ దీనిపై స్పందించాడు. ‘ఓమైగాడ్‌.. లవ్యూ గైస్‌.. సో క్యూట్‌.. సో స్వీటీ.. స్టే బ్లెస్డ్‌ టుగెదర్‌’ అని మరొక యూజర్‌ శుభాకాంక్షలు తెలిపాడు. ‘ఎంతటి మధురమైన ప్రపోజల్‌ ఇది.. లవ్‌ ఇట్‌..’ అని మరో యూజర్‌ స్పందించాడు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

ప్రకాశం బ్యారేజీని బోట్లు ఢీకొట్టడం కుట్రే... ఇందులో జ‌గ‌న్ పాత్ర ఉంది అన్న వర్ల రామయ్య వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular