– సుబ్బారెడ్డి జగన్ మోచేతి నీళ్ళు తాగేవాడు
– జగన్ పదవులు ఇస్తే అనుభవిస్తున్నారు
– ఇలా కాకపోతే ఎలా మాట్లాడుతారు ?
– రేపు సాయి రెడ్డి గారు కూడా మాట్లాడుతారు.
– సాయి రెడ్డి గారు కూడా ఆయన చేతిలోనే ఉన్నాడు
– జగన్ మోహన్ రెడ్డి పక్షాన ఉన్నారు అని తెలిసి కూడా వాళ్ల పేర్లు లేఖలో రాశాను
– వాళ్ళ దగ్గర ఇంకా నిజాయితీ ఏమైనా ఉందా చూద్దాం అనుకున్నాను
– వీళ్ళందరికీ వైఎస్ఆర్ తెలుసు. ఆయన మనోభావాలు కూడా తెలుసు
– అమ్మకు అర్థం కావాలి
– నా వరకు నేను చెప్తున్నది నిజమని నేను ప్రమాణం చేయగలను
– సుబ్బారెడ్డి కూడా ప్రమాణం చేయాలి
– వైఎస్ఆర్ బిడ్డ తన బిడ్డల మీద ప్రమాణం చేసి చెప్తుంది.
– వైఎస్ఆర్ ఉన్నప్పుడు భారతి,సాక్షి సిమెంట్స్ లో నలుగురు చిన్న బిడ్డలకు సమాన వాట ఉండాలన్నారు
– ఇది ప్రమాణంగా చెప్తున్న
– ఇచ్చిన మాట ఏమయ్యింది అని జగన్ అన్న ను అడిగా
– జగన్ నాన్నకు మాట ఇచ్చారు
– ఈ లోకంలో నీ తరువాత పాప మేలుకోరేది నేనే అని జగన్ చెప్పాడు
– డోంట్ వర్రీ డాడ్ అన్నాడు
– ఇది నిజం అని నా బిడ్డల మీద ప్రమాణం చేసి చెప్తా
– వైవీ సుబ్బారెడ్డి తన బిడ్డల మీద ప్రమాణం చేసి చెప్పాలి
– లేదా జగన్ మోహన్ రెడ్డి ప్రమాణం చేసి చెప్పాలి
– సుబ్బారెడ్డి అంటున్నాడు…సాక్షి కి, భారతి సిమెంట్స్ కి వాళ్ల పేర్లు పెట్టుకున్నారట
– అందుకే ఆ ఆస్తులు వాళ్లవే నట
– అందులో నాకు హక్కు లేదట
– జగన్ సొంతగా సంపాదించాడట
– ఆరోజు వాళ్ళ పేర్లు పెట్టుకుంటే నేను అభ్యంతరం చెప్పలేదు
– పేర్లతో ఏముంది అనుకున్నాను
– అన్న ముచ్చట పడ్డాడు అనుకున్నాను
– వాళ్ళ పేర్లతో ఆస్తులు ఉంటే…నిజంగా వాళ్లవి అవుతాయా ?
– నా పేరు మీద ఆస్తులు రాసి ఉంటే నేను ఎందుకు జైలుకి వెళ్ళలేదు అంటున్నారు
– ఏ అన్న అయినా…చెల్లెలు గిఫ్ట్ అంటే…ఏ బంగారమో… చీరనో… గిఫ్ట్ ఇస్తారు
– అంతేకాని ఆస్తుల్లో 40 శాతం వాట ఇస్తారా ?
– ఇవ్వాలని అనుకున్నది గిఫ్ట్ కాదు… నా హక్కు
– నా హక్కు కాబట్టే నాకు ఇస్తామని అన్నారు
– ఇవ్వాల్సిన భాధ్యత వాళ్లకు ఉంది కాబట్టి MOU రాశారు
– MOU రాయమని నేను అడగలేదు
– సరస్వతి సిమెంట్స్ ED అటాచ్ లో లేదు
– అందుకే సరస్వతి సిమెంట్స్ వెంటనే ట్రాన్స్ ఫర్ చేస్తామని హామీ ఇచ్చారు.
– ఇచ్చిన హామీ ఎందుకు నిలబెట్టుకోలేదు
– జగన్ మోహన్ రెడ్డి అంటున్నాడు…ప్రతి ఇంట్లో ఉండే కహాని అంట
– ఇంత సునాయాసంగా ఎలా మాట్లాడుతున్నారు
– మీకు సెంటిమెంట్ లేదా ?
– ఎమోషన్ లేదా ?
– ఈ మాటలు ఎవరో అంటే పట్టించుకొనే దాన్ని కాదు
– నా సొంత చిన్నాన్నా అంటే నా కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి
– చిన్నాన్న…నా బిడ్డలు నీ ముందు పెరగలేదా ?
– నా బిడ్డలను మీరు తాకలేదా ?
– దేవుడు అంతా చూస్తున్నాడు
– అంతా గమనిస్తున్నాడు
– వైసిపి క్యాడర్ కి నేను ఒక మాట చెప్పాలని అనుకుంటున్న
– 2019 లో వైసిపి ప్రభుత్వం 151 స్థానాలు గెలిచి ఏర్పడింది
– ఇది అప్పుడు అఖండ విజయం
– ఇది అప్పుడు ఎలా సాధ్యం అయింది
– ఎంతో మంది వైఎస్ఆర్ అభిమానులు అనుకుంటే వచ్చింది
– ఎంతో కష్టం పడితే…త్యాగాలు చేస్తే ఈ విజయం సాధ్యం అయింది
– నేనే కాదు…అమ్మే కాదు..ఎంతో మంది త్యాగాలు చేశారు
– నేను అమ్మ ఇద్దరం మా శక్తి కి మించి పని చేశాం
– అమ్మకు మోకాళ్ళ నొప్పులు ఉండేవి
– బాధలు భరించి ఏడ్చుకుంటూ పార్టీ కోసం కష్టం చేసింది
– నేను కూడా 3200 KM పాదయాత్ర చేశా
– నన్ను పాదయాత్ర చేయమని అడిగితే చేశా
– నన్ను ఆరోజుల్లో సూర్యుడు వరకు వెళ్ళమని అన్నా కూడా వెళ్ళే దాన్ని
– ప్రాణాలను సైతం నేను లెక్క చేయలేదు
– నాకు జగన్ అన్న అంటే ప్రాణం
– వైసిపి నీ అడుగుతున్న ..నేను మీకు ఏం అన్యాయం చేశా
– ఒక్క కారణం చెప్పండి
– మీకు ఏం అవసరం వస్తె అవసరానికి మించి తిరిగా
– సమైక్యాంధ్ర ఉద్యమం చేయమని అడిగితే చేశా
– ఓదార్పు యాత్ర చేశా
– బై బై బాబు అంటూ చేసిన క్యాంపెయిన్ దేశంలో పెద్దది
– మీకు ఇన్ని చేస్తే… మీరు నాకు ఏం చేశారు ?
– మీరు నాకు,నా బిడ్డలకు అన్యాయం చేస్తున్నారు
– ఇది అమ్మకు తెలుసు ..అందరికీ తెలుసు
– 5 ఏళ్లు మీరు రాసి ఇచ్చిన MOU నా చేతుల్లో ఉంది
– నాకు ఎన్ని ఇబ్బందులు ఉన్నా… నాకు అవసరం వచ్చినా… నేను బయట పెట్టలేదు
– MOU బయటకు పోతే వైఎస్ఆర్ గురించి నలుగురు నాలుగు రకాలుగా మాట్లాడుతారు.
– నాన్న పేరు చెడగొట్టడం నాకు ఇష్టం లేదు
– నాకు వేరే స్వార్థం ఉంటే నేను ఏదో ఒక మీడియా హౌజ్ కి ఇచ్చే దాని కదా
– ఇవ్వాళ అందరి చేతుల్లో MOU ఉంది
– దీనికి కారణం నువ్వు కాదా ?
– సొంత కొడుకు తల్లిని కోర్టుకి ఈడ్చాడు
– ఇది చూడటానికి నేను ఇంకా బ్రతికి ఉన్నానా అని విజయమ్మ ఏడుస్తుంది
– బెయిల్ రద్దు చేసేందుకు…నేను ఈ కుట్ర పన్నాను అంటున్నాడు
– అందుకే కోర్టుకి తల్లిని ఈడ్చాడట
– నీ లబ్ధి కోసం తల్లిని వాడుకుంటవా
– వైఎస్ఆర్ చనిపోయాక…CBI ఛార్జ్ షీట్ లో పేరు పెట్టించింది ఈ జగన్ కాదా ?
– ఛార్జ్ షీట్ లో పెట్టక పోతే… బెయిల్ రాధని చేర్చిన మాట నిజం కాదా ?
– నీ లబ్ధికి అమ్మా నాన్నలను వాడుకుంటారా?
– YCP కార్యకర్తలు మీరే ఆలోచన చేసుకోవాలి