Friday, September 20, 2024

చంద్రబాబు పాలనా వైఫల్యాలను కప్పిపుచ్చేందుకే లడ్డూ వివాదం

వైఎస్ షర్మిలా రెడ్డి
APCC చీఫ్
– చంద్రబాబు తిరుమల లడ్డుపై బాంబ్ పేల్చారు
– చావు కబురు చల్లగా చెప్పినట్లు ఉంది
– ఇది చిన్న విషయం కాదు
– జులై 12 న శాంపిల్స్ తీశారు
– అదే రోజు బాబు సిఎం గా ప్రమాణ స్వీకారం చేశాడు
– ఆ రోజు తీసుకున్న శాంపిల్స్ గత ప్రభుత్వం ఇచ్చిన నెయ్యి కాంట్రాక్టర్ వే
– ఆ శాంపిల్స్ లో బీఫ్ ఆయిల్, ఫిష్ ఆయిల్ కంటెంట్స్ ఉన్నాయి అని రిపోర్ట్ వచ్చింది
– ఇది సెంటిమెంట్ కి సంబందించిన విషయం
– దేశ విదేశాల్లో ఎంతో మంది భక్తులు ఆందోళనలో ఉన్నారు
– భక్తి శ్రద్ధలతో తిరుమల ప్రసాదాన్ని కళ్ళకు అద్దుకుని తీసుకుంటారు
– అలాంటి ప్రసాదాన్ని కల్తీ చేశారు
– చంద్రబాబు ను అడుగుతున్నాం
– ఇంత పెద్ద విషయాన్ని ఇంతకాలం ఎలా క్యాజువల్ గా తీసుకున్నారు
– ఇప్పుడే ఎందుకు బయట పెట్టారు ?
– దీని సివియారిటీ బాబు కి ముందే తెలుసా ?
– తెలిస్తే ఎందుకు ప్రజలకు చెప్పలేదు ?
– జులై 23 న రిపోర్ట్ ఇస్తే ఎందుకు దాచారు ?
– మీ 100 రోజుల పాలన సమావేశంలో ఎందుకు చెప్పారు ?
– మీ 100 రోజుల పాలన పై ప్రజలు నిరుత్సాహంగా ఉన్నారు
– ఈ విషయాన్ని గమనించి  ఇష్యు దైవర్ట్ చేశారా ?
– వైసిపి మీద బురద చల్లుతున్నారా ?
– మీరు ఈ విషయాన్ని లైట్ తీసుకున్నారు
– మీరు లైట్ తీసుకున్నా మేము మాత్రం వదిలి పెట్టం
– కేంద్ర హోం శాఖ మంత్రికి లెటర్ రాస్తున్నాం
– తిరుమల లడ్డూ కల్తీ పై CBI విచారణ జరగాలి
– లడ్డూ కల్తీ పై మేము గవర్నర్ ను కలుస్తాం
– చంద్రబాబు 100 రోజుల పాలన ఎలా ఉంది అంటే ..
– శిశుపాలుడు 100 తప్పులను వేతికినట్లుగా…
– YSR  విగ్రహాలను, వైఎస్ఆర్ పేర్లను తొలగించడానికి సరిపోయినట్లుగా ఉంది
– చంద్రబాబు 100 రోజుల పాలన నూటికి సున్నా
– 100 రోజుల్లో యాక్షన్ ప్లాన్ అని చెప్పాడు
– 100 రోజుల్లో అద్భుతాలు అన్నాడు
– 100 రోజుల్లో రాష్ట్రాన్ని గాడిలో పెడతాం అన్నాడు
– మోడీ డైరెక్షన్ లో బాబు 100 రోజుల సినిమా అట్టర్ ప్లాప్
– సూపర్ సిక్స్ లో కనీసం ఒక్క సిక్స్ కూడా అమలు కాలేదు
– 100 రోజుల్లో అన్ని కావాలని మేము అడగడం లేదు
– ఒక మోస పూరిత ప్రభుత్వాన్ని గద్దె దించి అధికారం ఇస్తే..నమ్మకాన్ని నిలబెట్టుకునే భాధ్యత ఉండాలి కదా !
– అన్నదాత సుఖీభవ కింద ఏడాదికి 20 వేలు అన్నాడు…ఎప్పుడు ఇస్తారో తెలియదు
– కనీసం 7 లక్షల ఎకరాలు పంట నష్టం జరిగితే ఒక్క రూపాయి ఇవ్వలేదు
– నిరుద్యోగులకు 20 లక్షల ఉపాధి అవకాశాలు అన్నాడు
– లేకుంటే 3 వేల నిరుద్యోగ భృతి అన్నాడు
– ఉపాధి లేదు…భృతి లేదు
– 2014 లో 2 వేలు భృతి అని మోసం చేశారు
– ఇప్పుడు మ్యానిఫెస్టోలో పెట్టాడు
– ఇది ఇస్తారో లేకుంటే కొట్టుకు పోతుందో తెలియదు
– తల్లికి వందనం కింద 15 వేలు ఇస్తామన్నారు
– ఎంత మంది బిడ్డలు అంటే అన్ని 15 వేలు అన్నాడు
– ఈ ఏడాది ముగుస్తుంది..దీని మీద అసలు స్పందనే లేదు
– రాష్ట్ర వ్యాప్తంగా 80 లక్షల మంది పిల్లలు ఎదురు చూస్తున్నారు
– మహాశక్తి కింద ఇస్తామని చెప్పిన నెలకు 15 వందల పథకం పై క్లారిటీ లేదు
– ప్రతి మహిళను ఒక శక్తి గా చేస్తా అన్నాడు
– మహిళలకు భరోసా నింపుతా అన్నాడు
– ఈ పథకం ఎప్పుడు అమలు అవుతుందో తెలియదు
– 3 సిలిండర్లు లేవు… ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం లేదు
– దసరా,దీపావళి అని కాలం వెళ్లదీస్తున్నారు
– 250 కోట్లు విలువ చేసే ఆర్టీసీ ఉచిత ప్రయాణం ఇవ్వడానికి ఇబ్బంది ఏంటి ?
– కొత్త బస్సులు అని కాలయాపన చేస్తున్నారు
– తెలంగాణలో 35 లక్షల మంది మహిళల నుంచి 50 లక్షల మంది మహిళలు బస్సులను ఎక్కుతున్నారు
– ఇది మంచి పథకం
– తొందరగా అమలు చేయండి
– పథకాల అమలు పై ప్రశ్నిస్తుంటే…. డబ్బులు లేవు అంటున్నాడు
– రాష్ట్రం అప్పుల్లో ఉంది అంటున్నాడు
– రాష్ట్ర పరిస్థితి మీకు ఎన్నికల ముందే తెలుసు
– 11 లక్షల కోట్ల అప్పుల్లో ఉంది అని మీరే చెప్పారు
– మీకు అప్పులు ఉన్నాయని తెలియదా ?
– 100 రోజుల్లో 100 అబద్ధాలు చెప్తున్నారు
– ప్రభుత్వ భాధ్యత ను విజయం కింద లెక్క గడుతున్నారు
-100రోజుల పాలనపై 100 విజయాలు అంటూ కరపత్రం రిలీజ్ చేశారు.
-ఈ కరపత్రం చూస్తుంటే నవ్వాలో,ఏడవాలో తెలియని పరిస్థితి
-హామిలు ఇవ్వడం 100రోజుల విజయమట.
-చేసిన పర్యటనలు 100 రోజుల విజయమట
-వరద సహాయం కింద ఇచ్చిన 25కేజిల బియ్యం 100రోజుల విజయమే నట
-బుడమేరు గండ్లు పూడ్చడం 100రోజుల విజయమేనట
-అమరావతికి 15వేల కోట్ల గ్యారెంటి రుణాల్లో ఒక్క రూపాయి రాకపోయినా 100రోజుల విజయమేనట
-దివ్యాంగుడు నారా లోకేష్ కి కాలేజిలో సీట్ కావాలని మెసేజ్ చేస్తే అది 100రోజుల విజయమేనట
-ప్రజాదర్భార్ లో ప్రజలనుంచి అర్జీలు స్వీకరించడం 100రోజుల విజయమే నట
-చంద్రబాబు 10రోజులు కలెక్టర్ ఆఫీసులో నిద్రిస్తే అది 100రోజుల విజయమే నట
-సౌది అరెబియాలో ఒక తెలుగు కుటుంబాన్ని తిరిగి స్వస్తలానికి రప్పిస్తే అది 100రోజుల విజమేనట
-విశాఖ స్టీల్ ప్యాక్టరిలో కేంద్ర మంత్రి పర్యటిస్తే అది 100రోజుల విజయమేనట
-గత ప్రభుత్వం అమలు చేసిన పథకాలకు పేర్లు మార్చడం 100రోజుల విజయమేనట
-భాద్యతలను విజయాలుగా చెప్పుకుంటూ డబ్బాలు కొట్టుకుంటున్నారే తప్పా…
-100రోజుల పాలనలో ఏపి ప్రజలకు ఒరిగింది ఏమిలేదు
– రాష్ట్రానికి రావాల్సిన హక్కులపై బీజేపీ తో పోరాటం లేదు
– పోలవరం అంచనాలను 30 వేల కోట్లకు సవరించారు
– ఎప్పుడు పూర్తి అవుతుందో తెలియదు
– కేంద్రం పూర్తి చేయాల్సిన ప్రాజెక్టు ఇది
– రాష్ట్ర విభజన హక్కు పోలవరం
– విశాఖ స్టీల్ ప్రైవేటీకరణ కాదు అనే నమ్మకం లేదు
– ప్రైవేటీకరణ లేదు అని నిధులు ఇవ్వడం లేదు
– జీతాలు ఇచ్చుకొనే పరిస్థితి లేదు.
– కార్మికులు ఆందోళన చేస్తున్నా పట్టింపు లేదు
– విశాఖ స్టీల్ కి వెంటనే సొంత మైన్ ఇవ్వాలి
– వైఎస్ఆర్ హయాంలో సొంత మైన్ కోసం అగ్రిమెంట్ జరిగింది
– మెడికల్ కాలేజీలను ఎందుకు ప్రైవేటీకరణ చేయాలని చూస్తున్నారు ?
– సీట్లు వద్దు అని ఎవరైనా అంటారా ?
– అదనపు సీట్లు కావాలని కోరాలి కదా ?
– రాష్ట్రంలో అసలు మెడికల్ సీట్లు తక్కువ
– 17 మెడికల్ కాలేజీలు అందుబాటులో వస్తె అదనంగా 2 వేల సీట్లు వచ్చేవి
– తక్షణ ఏర్పాట్లు చేసి సీట్లను భర్తీ చేయాలి
– వాలంటీర్లు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలో ఉన్నారు
– చంద్రబాబు వాలంటీర్లు వ్యవస్థ ను ఉండనిస్తాం అన్నారు
– క్యాబినెట్ లో వాలంటీర్లు వ్యవస్థ ను కొనసాగింపు లేదు అన్నారు
– వాలంటీర్లు కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నాం
– ఉచిత ఇసుక పథకంలో ఉచితం లేదు
– బాబు 100 రోజుల లో సాధించిన విజయం 99 కి క్వాటర్
– కానీ మద్యం ఏరులై పారుతుందనీ భయం ఉంది
– మద్యం అమ్మకాలు పెరిగితే మహిళల మీద అత్యాచారాలు పెరుగుతాయి
– మద్యం అమ్మకాలను నియంత్రించాల్సిన భాధ్యత బాబు పై ఉంది
– వైసిపి విశ్వసనీయత కోల్పోయింది
– వైఎస్ఆర్ మంచి పేరు సాధిస్తే..జగన్ చెడ్డపేరు సాధించారు
– ఇచ్చిన హామీలు పేరుతో ప్రజలను జగన్ మోసం చేశారు
– వైఎస్ఆర్ కి జగన్ కి పొంతన లేదు
– వైఎస్ఆర్ ప్రజా సంక్షేమం కోసం పాటుపడితే…జగన్ రిషికొండ పేరుతో కబ్జాలు చేశాడు
– బాత్ రూంకు సముద్రపు వ్యూ కావాలని కట్టుకున్నాడట
– ఒక మహిళ జత్వాని ఎంత వేదించాడో మనకు తెలుసు
– వైసిపి ఇక అంతం అయినట్లే
– వైసిపి లో జగన్ తప్పా ఎవరు మిగలరు
– వైసిపి చుట్టూ ఉన్న సాయి రెడ్డి, సజ్జల కూడా మిగలరు

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

ప్రకాశం బ్యారేజీని బోట్లు ఢీకొట్టడం కుట్రే... ఇందులో జ‌గ‌న్ పాత్ర ఉంది అన్న వర్ల రామయ్య వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular