Wednesday, January 8, 2025

వైఎస్పార్‌టీపీ త్యాగంతో తెలంగాణ‌లో కాంగ్రెస్ కు అధికారం

డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి మనవడు వైఎస్ రాజారెడ్డి పెళ్లి కానున్న‌ద‌ని వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వెల్ల‌డించారు. మంగ‌ళ‌వారం ఆమె కుటుంబ స‌భ్యుల‌తో క‌లిసి ఇడుపుల‌పాయ వైఎస్సార్ ఘాట్ వ‌ద్ద నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వైఎస్సార్ సమాధి వద్ద వివాహ పత్రికను ఉంచి ఆశీస్సుల‌ను తీసుకున్నారు. వైఎస్సార్ తో పాటు ప్రజలందరి దీవెనలు కొత్త దంపతులపై ఉండాలని కోరారు. కాంగ్రెస్ పార్టీతో కలిసి పని చేయాలని ఇది వరకే నిర్ణయించామ‌ని.. అందుకే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చామ‌న్నారు. కేసీఅర్ ప్రజా వ్యతిరేక ప్రభుత్వాన్ని దించడంలో వైఎస్పార్‌టీపీ చాలా పెద్ద పాత్ర పోషించింద‌ని.. 31 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు 10 వేల లోపు మెజారిటీతోనే గెలిచార‌ని గుర్తు చేశారు. దీనికి కారణం వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ ఎన్నికల్లో పోటీ చేయక పోవడమేన‌ని గుర్తు చేశారు. ఒక‌వేళ త‌మ పార్టీ తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేసి ఉంటే కాంగ్రెస్ కి ఇబ్బంది అయి ఉండేద‌న్నారు. ఈ కృతజ్ఞత భావం కాంగ్రెస్ పార్టీకి కూడా ఉందని.. వైఎస్సార్ తెలంగాణ పార్టీ త్యాగానికి విలువ కూడా ఉంద‌ని తెలిపారు. త‌మ త్యాగానికి విలువ నిచ్చి మమ్మల్ని కాంగ్రెస్ పార్టీలో చేరమని ఆహ్వానం పంపార‌ని తెలిపారు. కాంగ్రెస్ లో చేరడానికి త‌మ‌కు ఎటువంటి అభ్యంతరం లేద‌న్నారు. ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ అతి పెద్ద సెక్యులర్ పార్టీ అని.. ప్రతి ఒక్కరికీ భద్రత ఇచ్చే పార్టీ కాంగ్రెస్ పార్టీ అందుకే తాను కాంగ్రెస్ పార్టీని బ‌ల‌ప‌ర‌చాల‌ని నిర్ణ‌యించుకున్నామ‌ని తెలిపారు. ఈ క్రమంలోనే రేపు ఢిల్లీకి వెళ్తున్నామ‌ని.. ఒకటి రెండు రోజుల్లో అందరి ప్రశ్నలకు సమాధానం దొరుకుతుంద‌న్నారు.

ప్ర‌దాన వార్త‌లు

గోటితో పోయే దాన్ని గోడ్డ‌లి వ‌ర‌కు తెచ్చారు... బ‌న్నీ అరెస్ట్‌ వివాదంపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ వ్యాఖ్యలను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com