Wednesday, November 20, 2024

కడప స్టీల్ ఫ్యాక్టరీ కోసం వైఎస్ షర్మిలా రెడ్డి వినూత్న నిరసన

  • కడప కలెక్టర్ కార్యాలయం వద్ద కడప స్టీల్ ఫ్యాక్టరీ కోసం ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి వినూత్న నిరసన
  • కడప స్టీల్ ఫ్యాక్టరీ కి కొబ్బరి కాయ కొట్టి నిరసన తెలిపిన వైఎస్ షర్మిలా రెడ్డి
  • కడప స్టీల్ అంటే కొబ్బరి కాయలు కొట్టే ప్రాజెక్టు – వైఎస్ షర్మిలా రెడ్డి
  • ముఖ్యమంత్రులు మారడం, కొబ్బరి కాయలు కొట్టడం ఇదే తంతు – వైఎస్ షర్మిలా రెడ్డి

2014లో కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాలేదు. కాబట్టి ప్రత్యేక హోదా రాలేదు.
ఏ ఒక్క విభజన హక్కు రాలేదు. కడప స్టీల్ ప్లాంట్ కూడా రాలేదు.
బీజేపీ పుణ్యమా అని ఇంతవరకు విభజన హామీ నెరవేర్చలేదు
కడప స్టీల్ ప్లాంట్ ఫ్యాక్టరీ పెట్టాలని విభజన చట్టంలో ఉంది
ప్రత్యేక హోదా కూడా ఇవ్వమని తేల్చిచెప్పింది
అలాంటి బీజేపీ గత పదేళ్ల నుంచి చంద్రబాబు, జగన్ మద్దతు ఇస్తున్నారు
2014లో చంద్రబాబు సీఎం అయ్యాక కపడ స్టీల్ ప్లాంట్ కట్టమని బీజేపీ చెప్పింది.
తాపీగా 2019లో స్టీల్ ఫ్యాక్టరీకి కొబ్బరికాయ కొట్టారు చంద్రబాబు గారు
వైఎస్ఆర్ కొట్టిన స్థలంలో కాకుండా వేరే స్థలంలో కొబ్బరికాయ కొట్టారు
4వేల ఎకరాల్లో 3 మిలియన్ టన్నులు ప్లాంట్ కట్టాలని చంద్రబాబు అనుకున్నారు
2019లో జగన్ ముఖ్యమంత్రి అయ్యారు. మళ్లీ ఇంకో స్థలంలో కొబ్బరికాయ కొట్టారు
ఎన్నికలు ఆరు నెలలు ఉండగా కొబ్బరికాయ కొడితే దానిని మోసం అంటారు
అదే ఎన్నికల అయిపోయాక కొబ్బరికాయ కొడితే చిత్తశుద్ది అంటారు అంటూ ఆస్కార్ డైలాగులు చెప్పారు
ఇదే జమ్మలమడుగులో పుట్టాను పుట్టిన గడ్డ రుణం తీర్చుకంటానని పెద్ద పెద్ద డైలాగులు చెప్పారు
కాలయాపన జరిగిందే తప్ప తట్టెడు మట్టి కూడా తీయలేదు
3 సంవత్సరాల తర్వాత 2023లో మళ్లీ కొబ్బరికాయ కొట్టారు
జిందాల్ స్టీల్ వాళ్లకు ఈ ప్లాంట్ నిర్మాణం అప్పగిస్తున్నామని చెప్పారు.

సజ్జన్ జిందాల్ గారు చెప్పింది ఏంటంటే జగన్‌తో మా బంధం ఏనాటితో అని చెప్పారు
జగన్ అధికారంలోకి దిగాక వారి బంధం గురించి ప్రజలకు తెలిసింది
సజ్జన్ జిందాల్‌పై కాదంబరి జెత్వానీ కేసు పెడితే పోలీసులను ముంబైకి పంపించి ఆమెను ఏపీకి తీసుకొచ్చి జైలులో పెట్టారు
10 ఏళ్లు ఎంపీగా ఉన్న అవినాశ్ రెడ్డి కడప స్టీల్ ప్లాంట్ కోసం ఎన్ని సార్లు మాట్లాడారు సమాధానం చెప్పాలి
కడప జిల్లాకు చెందిన మాజీ ముఖ్యమంత్రి, పులివెందుల ఎమ్మెల్యే దీనిపై సమాధానం చెప్పాలి
ఐదేళ్లు ముఖ్యంత్రిగా జగన్ ఉండి కూడా వైఎస్‌ఆర్ కల అయిన కడప స్టీల్ ప్లాంట్ ఎందుకు కట్టలేదు
ఇప్పుడు ఓడిపోయి కడప జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యేగా ఉన్న జగన్ ఎందుకు అసెంబ్లీకి వెళ్లడం లేదు
కడప స్టీల్ ప్లాంట్ నిర్మాణం, సూపర్ సిక్స్ హామీలు, ఇతర ప్రభుత్వ వైఫల్యాలపై అసెంబ్లీకి వెళ్లి ఎందుకు ప్రశ్నించడం లేదు
ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వెళ్లరట.. ప్రతిపక్ష హోదాకు తగ్గ సీట్లు ఎందుకు గెలవలేకపోయారు
మిమ్మల్ని ప్రజలు చిత్తుగా తిరస్కరించారు. అందుకే ప్రతిపక్ష హోదా లేదు
కడప జిల్లా ప్రజల చిరకాల కోరిక అయిన కడప స్టీల్ ఫ్యాక్టరీ కట్టాల్సిందే కాంగ్రెస్ పార్టీ అల్టీమేటం ఇస్తున్నాం.
ప్రభుత్వం స్పందించకపోతే కాంగ్రెస్ పార్టీ తరపున ధర్నాలు, ర్యాలీలు, రాస్తారోకోలు చేస్తాం.
కావాలంటే ఆమరణ నిరాహార దీక్ష చేయడానికైనా సిద్ధం

అవినాశ్ రెడ్డి ఆదేశాలతోనే సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టారని తేలింది
మరి అవినాశ్ రెడ్డిని పోలీసులు ఎందుకు అదుపులోకి తీసుకోవడం లేదు
సజ్జల భార్గవ రెడ్డిని కూడా అరెస్ట్ చేయడం లేదో పోలీసులు సమాధానం చెప్పాలి
పోస్టులు పెట్టేవారినే కాదు.. పోస్టులు పెట్టేలా ప్రేరేపించే వారిని అరెస్ట్ చేయాలి
ఏ ప్యాలెస్‌లో బతుకుతున్న పెద్ద తలకాలయలను కూడా అరెస్ట్ చేయాలి
అప్పుడే మహిళలకు న్యాయం జరుగుతుంది
ఎవరైనా మహిళలను వ్యక్తిగతంగా కుంగదీస్తే ఇంకెలా రాజకీయాల్లోకి వస్తారు
ఇలాంటి వారి పట్ల కఠినంగా వ్యవహరించాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

బోనస్ ఇచ్చి ధాన్యం కొంటున్నట్టు రేవంత్ రెడ్డి మహారాష్ట్రలో గప్పాలు కొట్టాడు అన్న హరీశ్ రావు వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..!
- Advertisment -

Most Popular