“ నిన్ను సీఎం గా చూడాలని ఎంతో తపించిన చిన్నాన్న ను ఈ విధంగా మాట్లాడటం, సీఎం పత్రిక, టీవీ చానెల్ లో , సోషల్ మీడియాలో , వైసీపీ పార్టీ వర్గాలు తీవ్ర రూపంలో మాట్లాడటం, చెప్పలేనంత విధంగా అసహనం చేయించడం ఇది నీకు తగునా అని ప్రశ్నించారు. ఇదంతా జరిగినా న్యాయం కోసం పోరాటం చేస్తున్న చెల్లెళ్ళను హేళన చేస్తూ, నిందలు మోపుతూ,దాడులకు కూడా తెగబడే స్థాయికి కొంతమంది దిగజారుతుంటే ఎందుకు చూస్తూ ఉన్నారని నిలదీశారు.
సునీతకు మద్దతుగా నిలిచి పోరాటం చేస్తున్న షర్మిల ను కూడా టార్గెట్ చేస్తుంటే..
ఇన్సుకు నిమ్మకు నీరెత్తినట్లు ఉంటన్నారని ప్రశ్నించారు. కుటుంబ సభ్యునిగా కాకపోయినా రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా ఎందుకు స్పందించడం లేదు అని అన్నారు. అంతే కాకుండా హత్యకు కారకులైన ఆయిన వారికి మరలా ఎంపీగా అవకాశాన్ని ఎందుకు కల్పించారని నిలదీశారు. హత్యకు కారకుడు ఆయిన నిందితుడు నామినేషన్ దాఖలు చేశారని, ఇప్పటికైనా న్యాయం, ధర్మం ఆలోచన చేయాలని కోరారు. సీఎం గా రాగ, ద్వేషాలకు అతీతంగా పరిపాలన చేస్తామని ప్రమాణం చేశారని, ఆఖరు గా న్యాయం,ధర్మం,నిజం వైపు నిలబడమని వేడుకుంటున్నట్లు సౌభాగ్యమ్మ లేఖలో ప్రస్తావించారు.