Tuesday, December 24, 2024

అక్కినేని హీరోతో మీనాక్షి నిశ్చితార్ధం

గాసిప్‌ అంటే పదం వింటే చాలు ముందుగా మనకు గుర్తువచ్చేది సినిమా ఇండస్ట్రీ. అందులోనూ ఇది బాలీవుడ్‌లో కాస్త ఎక్కువగా ఉంటుంది. అయితే ఆ సంస్కతి ఇప్పుడు తెలుగు సినిమా పరిశ్రమకు కూడా పాకింది. అయితే కొన్ని సార్లు రూమర్లు నిజమవ్వొచ్చు. కానీ ఊహించిన విధంగా ఇద్దరికి సంబంధం అంటగడుతూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం సంచలనంగా మారింది. తాజాగా తెలుగు సినిమా రంగంలో ఓ యువ హీరో, హీరోయిన్‌కు ఎంగేజ్‌మెంట్ అయిందనే వార్త సోషల్ మీడియాలో గుప్పుమన్నది. ఆ వార్తలో నిజమెంత అనే వివరాల్లోకి వెళితే.. ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉన్న టాలీవుడ్‌ హీరోయిన్లలో మీనాక్షి చౌదరీ ఒకరు. గుంటూరు కారం, లక్కీ భాస్కర్ సినిమాల్లో తనదైన నటనతో మెప్పించి వరుసు విజయాలు అందుకొన్నది. తాజాగా ఈ అందాల భామ నటించిన మట్కా విడుదలయింది. ఇక మీనాక్షి చౌదరీ నటించిన మరో సినిమా కూడా ఈ ఏడాదిలోనే రిలీజ్ కానున్నది. విశ్వక్ సేన్ నటించిన మెకానిక్ రాకీ సినిమాలో కూడా హీరోయిన్‌గా నటిస్తున్నది. ఈ సినిమా కూడా నవంబర్ 22వ తేదీన రిలీజ్ కానున్నది. దాంతో ఈ టాలెంటెడ్ హీరోయిన్ ఒకే ఏడాదిలో 4 సూపర్ హిట్స్ అందుకొన్న ఘనతను సొంతం చేసుకోవడానికి రెడీ అవుతున్నది. ఇలా కేరీర్ పరంగా మీనాక్షి చౌదరీ దూసుకెళ్తున్న సమయంలో సడెన్‌గా ఎవరూ ఊహించని విధంగా ఓ రూమర్ ఈ బ్యూటీపై వచ్చింది. అక్కినేని కుటుంబానికి చెందిన సుశాంత్‌తో ఎంగేజ్‌మెంట్ జరిగింది అనే ఓ వార్త సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతున్నది. వీరిద్దరి పెళ్లి నిశ్చితార్థం ఇటీవల జరిగింది. త్వరలోనే వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారంటూ పోస్టు పెట్టారు. అయితే గాసిప్ వార్తపై అటు మీనాక్షి, సుశాంత్ ఎవ్వరూ స్పందించలేదు. ఇది ముమ్మాటికి ఫేక్ న్యూస్. ఈ వార్తలో ఎలాంటి వాస్తవం లేదు. ఇలాంటి రూమర్లను నమ్మకూడదని వీళ్ళ పీఆర్‌ వర్గాలు వెల్లడించారు.

ప్ర‌దాన వార్త‌లు

దురుద్దేశంతోనే తనపై కేసు పెట్టారన్న కేటీఆర్ వ్యాఖ్యలను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com