Wednesday, January 1, 2025

అల్లు అర్హ అంటే డాడీ కూతురు అనుకుంటివా… డాడీ ప్రిన్సెస్‌

అల్లుఅర్జున్‌ పుష్ప2 ఇప్పుడు ఎక్కడ చూసినా ఈ సినిమా గురించే హాట్‌ టాపిక్‌ అయింది. అదే విధంగా అల్లు అర్హ గురించి గత రెండు మూడు రోజులుగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతూనే ఉంది. ఇటీవల తండ్రి అల్లు అర్జున్‌తో కలిసి అల్లు అర్హ అన్‌స్టాపబుల్‌ షోకి వెళ్లింది. ఆ సమయంలో బాలకృష్ణ నీకు తెలుగు వచ్చా అని అడిగినప్పుడు ఏకంగా 10వ తరగతి తెలుగు పద్యంను గుక్కతిప్పుకోకుండా అర్హ చెప్పిన వీడియోలు సోషల్‌ మీడియాలో సునామి మాదిరిగా విస్తరించాయి. కొన్ని గంటల్లోనే అర్హ ప్రతిభను పొగుడుతూ ఆ వీడియోలను వైరల్‌ చేయడం జరిగింది. తండ్రిగా అల్లు అర్జున్‌ గర్వించదగ్గ ప్రతిభ అర్హ సొంతం అంటూ ఆ వీడియోలను షేర్‌ చేసిన చాలా మంది అభిప్రాయం వ్యక్తం చేశారు. నేడు మరోసారి అర్హ సోషల్‌ మీడియాలో ట్రెండ్‌ అవుతోంది. నేడు అల్లు అర్హ పుట్టిన రోజు కావడంతో తల్లిదండ్రులు స్నేహా, అల్లు అర్జున్‌లు సోషల్‌ మీడియా ద్వారా ఆమె క్యూట్‌ వీడియోలను షేర్‌ చేయడం ద్వారా అందరి దృష్టిని ఆకర్షించారు. ముఖ్యంగా అల్లు అర్జున్‌ ఒక క్యూట్‌ అర్హ వీడియోను షేర్‌ చేయడం జరిగింది. దాంతో పాటు నా లైఫ్‌ లో సంతోషానికి హ్యాపీ బర్త్‌డే. మై లిటిల్ అర్హ, అప్పుడే నీకు 8 ఏళ్లు పూర్తి అయ్యాయి. నువ్వు వచ్చిన తర్వాత నా జీవితం చాలా సంతోషంగా మారింది. నీకు బోలెడంత ప్రేమ, హగ్గులతో, ముద్దులతో నీ నాన్న అంటూ అల్లు అర్జున్‌ పోస్ట్‌ చేసిన వీడియో వైరల్‌ అవుతోంది. అల్లు అర్జున్‌కి తన కూతురు అంటే ఎంత ప్రేమ ఉందో దీంతో మరోసారి క్లారిటీ వచ్చింది అంటూ నెటిజన్స్‌ కామెంట్స్ చేస్తున్నారు. పుష్ప సినిమాతో ఎంత బిజీగా ఉన్నా అర్హ కోసం బన్నీ టైం కేటాయించడం జరుగుతుందని స్నేహా ఆ మధ్య ఒక ఇంటర్వ్యూలో అన్నారు. అల్లు అర్హ అంటే డాడీ కూతురు అనుకుంటివా… డాడీ ప్రిన్సెస్‌ అంటూ సోషల్ మీడియా ద్వారా పుష్ప తరహాలో డైలాగ్‌ చెప్పి అందరిని ఆకట్టుకున్న అల్లు అర్జున్‌ ఇప్పుడు బర్త్‌ డే శుభాకాంక్షలను విభిన్నంగా చెప్పడం ద్వారా మరోసారి వార్తల్లో తన కూతురును ఉంచాడు.

ప్ర‌దాన వార్త‌లు

గోటితో పోయే దాన్ని గోడ్డ‌లి వ‌ర‌కు తెచ్చారు... బ‌న్నీ అరెస్ట్‌ వివాదంపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ వ్యాఖ్యలను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com