Monday, November 18, 2024

ఆర్టీవీ అభ్యర్థన తిరస్కరించిన హైకోర్టు

సోషల్ మీడియాలోపోస్టుపై పెట్టిన కేసు కొట్టేయాలని లేదా విచారణకు సమయం ఇవ్వాలన్న ఆర్జీవీ అభ్యర్థనను ఏపీహైకోర్టు కొట్టేసింది. పోలీసులతోనే తేల్చుకోవాలని సూచించింది. వివాదాస్పద దర్శకుడు రామ్‌గోపాల్ వర్మకు ఆంధ్రప్రదేశ్‌లో హైకోర్టులో షాక్ తగిలింది. తనపై నమోదు అయిన కేసులు కొట్టేయాలన్న పిటిషన్‌ను హైకోర్టు తిరస్కరించింది. చంద్రబాబు, పవన్ కల్యాణ్‌పై గతంలో ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని ఆరోపణలతో ఆయనపై ఈ మధ్యే కేసు నమోదు అయింది. రేపు విచారణకు రావాలని పోలీసులు నోటీసులు కూడా ఇచ్చారు.
సోషల్ మీడియాలో శ్రుతి మించి కామెంట్స్ చేస్తూ ఇతరులను కించపరిచే వారిపై కేసులు నమోదు అవుతున్నాయి. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ మద్దతుదారులతోపాటు రామ్‌గోపాల్ వర్మ లాంటి వాళ్లు కూడా చంద్రబాబు, లోకేష్ పవన్ కల్యాణ్‌ను తీవ్రంగా విమర్శించారు. ఇప్పుడు అవే వారి మెడకు చుట్టుకుంటున్నాయి. అందరిపై నమోదు అవుతున్నట్టుగానే ఆర్జీవీపై కూడా కేసులు రిజిస్టర్ అయ్యాయి. టీడీపీ మండల ప్రధాన కార్యదర్శి ముత్తనపల్లి రామలింగం ఫిర్యాదు మేరకు ప్రకాశం జిల్లా మద్దిపాడులో పోలీసులు కేసు నమోదు చేశారు. వ్యూహం సినిమా ప్రచారంలో భాగంగా చంద్రబాబు,లోకేష్‌పై అనుచితంగా మాట్లాడారని ఫిర్యాదులో పేర్కొన్నారు. నాడు ఆయన చేసిన కామెంట్స్‌కు సంబంధించిన సాక్ష్యాలను కూడా ఇచ్చారు.
ఈ కేసు కొట్టేయాలని రామ్‌గోపాల్ వర్మ ఆంధ్రప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించారు. కేసు కొట్టేయలేమని కోర్టు స్పష్టం చేసింది. అవసరం అరెస్టు చేస్తారనే భయం ఉంటే ముందస్తు బెయిల్ మంజూరు చేసుకోవాలని సూచించింది కోర్టు. కనీసం విచారణకు హాజరయ్యేందుకు సమయం కావాలని కూడా అభ్యర్థించింది. దీనికి కూడా పోలీసులతోనే తేల్చుకోవాలని కోర్టు స్పష్టం చేసింది. ఇలాంటివి తమ దృష్టికి తీసుకురావద్దని పేర్కొంది.

సోషల్ మీడియాలో పోస్టులు, చేసిన కామెంట్స్‌పై నమోదు అయిన కేసులో విచారణకు రావాలని ఇప్పటికే పోలీసులు నోటీసు ఇచ్చారు. ఇప్పుడు కోర్టులో కూడా ఆర్జీవీకి ఎదురు దెబ్బతగిలింది. ఇప్పుడు రామ్‌గోపాల్ వర్మ ఏం చేయబోతున్నారని విషయం ఉత్కంఠంగా మారింది. ఆయన 19న జరిగే విచారణకు హాజరవుతారా లేదా అన్నది తేలాల్సి ఉంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

బోనస్ ఇచ్చి ధాన్యం కొంటున్నట్టు రేవంత్ రెడ్డి మహారాష్ట్రలో గప్పాలు కొట్టాడు అన్న హరీశ్ రావు వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..!
- Advertisment -

Most Popular