Sunday, September 29, 2024

ఆర్థిక పరిస్థితిని గాడిలో పెట్టేందుకు ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు

  • ప్రభుత్వాన్ని వెంటాడుతున్న పాత అప్పులు 
  • కొత్తగా తెచ్చిన అప్పులు రూ.25,118 కోట్లు 
  • ఇప్పటివరకు వడ్డీలు సహా కిస్తులకు రూ.38,040 కోట్ల చెల్లింపులు 
  • అప్పులు, వడ్డీలు కలిపి రోజుకు రూ.191 కోట్ల చెల్లింపు
  • ఆర్థిక క్రమశిక్షణను పాటిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం
కాంగ్రెస్ ప్రభుత్వానికి గత ప్రభుత్వం చేసిన పాత అప్పులు భారంగా మారాయి. గత ప్రభుత్వం ఇబ్బడిముబ్బడిగా చేసిన అప్పులు ప్రస్తుతం తెలంగాణ ఆర్థిక విధ్వంసానికి మూలమయ్యాయి. అందులో భాగంగా ప్రతిరోజూ రూ.191 కోట్ల అప్పులు, వడ్డీలను చెల్లించాల్సిన పరిస్థితి ప్రస్తుత ప్రభుత్వానికి ఎదురయ్యింది. 2023 డిసెంబర్ నుంచి జూన్ 17వ తేదీ వరకు (199) రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న అప్పు రూ.25,118 కోట్లు కాగా, అసలు, వడ్డీలకు తిరిగి చెల్లించింది రూ.38,040 కోట్లుగా ప్రభుత్వం పేర్కొంది.
199 రోజుల్లో సగటున రోజుకు రూ.191 కోట్ల చెల్లింపు
అయినా ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి సిఎం రేవంత్‌రెడ్డి తనవంతు కృషిని చేస్తున్నారు. గత ప్రభుత్వం చేసిన అప్పులు, వడ్డీలు కలిపి తిరిగి చెల్లించేందుకు గడిచిన 199 రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వం సగటున ఒక రోజుకు రూ.191 కోట్లను చెల్లిస్తోంది. దీంతోపాటు ఆరు గ్యారంటీల అమలుతో పాటు మిగతా పథకాల కోసం తెచ్చిన కొత్త అప్పులకు వడ్డీలతో సహా కిస్తులను చెల్లిస్తూ ఆర్థిక పరిస్థితిని ప్రభుత్వం గాడిలో పెడుతోంది.
పదేళ్లుగా విధ్వంసమైన ఆర్థిక పరిస్థితిని గాడిలో పెట్టేందుకు ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు చేపట్టింది. గత ప్రభుత్వం చేసిన అప్పులు, వడ్డీలు చెల్లించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక క్రమశిక్షణను పాటిస్తోంది. దుబారా లేకుండా ప్రతి పైసాకు జవాబుదారీగా ఉండేలా ఖర్చులపై నియంత్రణను అమలు చేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న రుణం కంటే ఎక్కువ కిస్తులు చెలిచడంతో పాటు తెచ్చిన అప్పుల కంటే తిరిగి చెల్లింపులు ఎక్కువ చేసి ఆర్థిక క్రమశిక్షణను ప్రభుత్వం పాటిస్తోంది.
గత ప్రభుత్వం హయాంలో రూ.7 లక్షల కోట్ల అప్పులు 
గడిచిన పదేండ్లలో అప్పటి బిఆర్‌ఎస్ ప్రభుత్వం దాదాపు రూ.7 లక్షల కోట్లు అప్పులు చేసింది. వాటికి చెల్లించాల్సిన వడ్డీలు, నెలసరీ చెల్లింపులు తడిసి మోపడయ్యాయి. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఇప్పటివరకు డిసెంబర్ నుంచి జూన్ 17వ తేదీ  వరకు రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్, బడ్జెటేతర రుణాలన్నీ కలిపి రూ.25,118 కోట్లు అప్పులు చేసింది.
నెల తెచ్చిన అప్పులు అప్పులు, వడ్డీలకు చెల్లించినవి
(కోట్లలో)(కోట్లలో)
1.డిసెంబర్ 23 రూ.1400 రూ.4,754
2.జనవరి 24 రూ.3000 రూ.6,459
3.ఫిబ్రవరి 24 రూ.3000 రూ.4,648
4.మార్చి 24 రూ.7,718 రూ.8,458
5.ఏప్రిల్ 24 రూ.4,000 రూ.4,450
6.మే 24 రూ.4,000 రూ.7,487
7.జూన్ 24 రూ.2,000 రూ.1,785
మొత్తంరూ.25,118రూ.38,040

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

ప్రకాశం బ్యారేజీని బోట్లు ఢీకొట్టడం కుట్రే... ఇందులో జ‌గ‌న్ పాత్ర ఉంది అన్న వర్ల రామయ్య వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular