Tuesday, April 22, 2025

ఆస్కార్ 2025లో త‌ళుక్కుమ‌న్న ‘ఎం4ఎం’

‘ఎం4ఎం’ మూవీ హీరోయిన్ జో శర్మకు అమెరికాలోని లాస్ ఏంజిల్స్‌లో జరిగిన ప్రతిష్ఠాత్మక ఆస్కార్ అవార్డుల వేడుకలో పాల్గొనే అరుదైన అవకాశం లభించింది. ఈ అద్భుత‌మైన‌ వేడుక‌లో భాగమవ్వడం ఎంతో ఆనందంగా ఉందని, ముఖ్యంగా ప్రపంచ ప్రఖ్యాత హాలీవుడ్ పాప్ సింగర్, నటి అరియానా గ్రాండేను దగ్గరగా చూడటం అద్భుతమైన అనుభూతి అని జో శర్మ తన ఆస్కార్ అనుభ‌వాలను వ్యక్తపరిచారు.
“ఈ క‌ల‌ర్‌ఫుల్ ఈవెంట్‌ను సమీపంగా వీక్షించడం ఎంతో మధురమైన అనుభూతి” అని జో శర్మ చెప్పుకొచ్చారు. అదేవిధంగా, ఆమె ప్రధాన పాత్రలో నటించిన ‘ఎం4ఎం’ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుందని ప్రకటించారు. మోహన్ వడ్లపట్ల దర్శకత్వం వహించిన ఈ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో విడుదలకు సిద్ధమైంది.

ప్ర‌దాన వార్త‌లు

కేటీఆర్‌కు రాజకీయ ఓనమాలు తెలియవు.. అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్య లను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com