Thursday, November 28, 2024

ఓటీటీ లవర్స్‌కి పండగే ఈ వారం ఇంట్రెస్టింగ్‌ మూవీస్‌

ఈ వారం కూడా ఓటీటీ వేదికగా కొన్ని సినిమాలు, వెబ్‌ సిరీస్‌లు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నాయి. ఒకప్పుడు వారాంతం వస్తుందంటే కేవలం థియేటర్లలో విడుదలయ్యే సినిమాల గురించే చర్చ నడిచేది. కానీ ప్రస్తుతం ఓటీటీల రాకతో ప్రతీ వీకెండ్ కొంగొత్త సినిమాలు, వెబ్‌ సిరీస్‌లు ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు సిద్ధమవుతున్నాయి. ఇందులో భాగంగానే ఈ వారం కూడా ఓటీటీ వేదికగా కొన్ని సినిమాలు, వెబ్‌ సిరీస్‌లు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నాయి. మరి ఆ విశేషాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
ఈ వారం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాల్లో ‘ క’ ఒకటి. కిరణ్‌ అబ్బవరం హీరోగా తెరకెక్కిన ఈ సినిమా థియేటర్లలో మంచి విజయాన్ని నమోదు చేసుకుంది. కాగా తాజాగా ఈ సినిమాను ఓటీటీలోకి తీసుకొస్తున్నారు. ఈటీవీ విన్‌ ఓటీటీ వేదికగా ఈ సినిమా ఈ నెల 28వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది. డాల్బీ విజన్‌: అట్మాస్‌లో సినిమాని ఆస్వాదించొచ్చని ఈటీవీ తెలిపింది. ఈ వారం స్ట్రీమింగ్‌కు సిద్ధమైన మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్‌ వికటకవి వెబ్ సిరీస్‌. జీ5 వేదికగా ఈ వెబ్‌ సిరీస్‌ స్ట్రీమింగ్ కానుంది. తెలంగాణ నేపథ్యంలో వచ్చిన తొలి డికెక్టివ్‌గా ప్రాజెక్ట్‌గా చెబుతోన్న ఈ సిరీస్‌ నవంబర్‌ 28వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది. థియేటర్లలో మంచి విజయాన్ని అందుకున్న లక్కీ భాస్కర్‌ కూడా ఈ వారం ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది. అమెజాన్‌ ప్రైమ్‌ వేదికగా నవంబర్‌ 30వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుందని సమాచారం. దీనికి సంబంధించి ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. ఇంకా ప్రధానంగా అమెజాన్‌ ప్రైమ్‌లో బ్లడీ బెగ్గర్‌ (తమిళ్‌) నవంబరు 29 నుంచి స్ట్రీమింగ్ కానుంది. నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా సికిందర్‌ క ముకద్దర్‌ (హిందీ) నవంబరు 29 నుంచి, ది గ్రేట్‌ ఇండియన్‌ కపిల్‌ (టాక్‌ షో) నవంబరు 30 నుంచి ది ట్రంక్‌ (కొరియన్‌) నవంబరు 29, అవర్‌ లిటిల్‌ సీక్రెట్‌ నవంబరు 27, ఫైండ్‌ మి ఇన్‌ పారిస్‌ (ఇంగ్లీష్‌) నవంబరు 28, ది స్నో సిస్టర్‌ (ఇంగ్లీష్‌) నవంబరు 29, ది మ్యాడ్‌నెస్‌ (ఇంగ్లీష్‌) నవంబరు 28 స్ట్రీమింగ్ కానున్నాయి. అదే విధంగా డిస్నీ+హాట్‌స్టార్‌ వేదికగా పారాచూట్‌ నవంబరు (వెబ్‌సిరీస్‌) నవంబరు 29వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌కు రానుంది. సన్‌ నెక్ట్స్‌లో కృష్ణం ప్రణయ సఖి (కన్నడ) నవంబరు 29వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

ఒకే రోజు రెండు బ్లాక్‌బస్టర్ తెలుగు సినిమాలు
దీపావళికి రిలీజై సంచలన విజయం సాధించిన తెలుగు సినిమాలు క, లక్కీ భాస్కర్. గత నెల 31న థియేటర్లలోకి వచ్చి బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురిపించిన మూవీస్ ఇవి. ఇప్పుడీ సినిమాలు గురువారం (నవంబర్ 28) నుంచి ఓటీటీలోకి అడుగుపెడుతున్నాయి. బ్లాక్‌బస్టర్ టాక్ సొంతం చేసుకున్నా.. నెల రోజుల్లోపే డిజిటల్ ప్రీమియర్ కానున్నాయి.


కిరణ్ అబ్బవరం నటించిన మూవీ క (KA). దీపావళి సందర్భంగా అక్టోబర్ 31న రిలీజైంది. పెద్దగా అంచనాలు లేకుండా వచ్చిన ఈ సినిమా సంచలన విజయం సాధించింది. కిరణ్ అబ్బవరం కెరీర్లోనే అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా నిలిచింది. అమరన్, లక్కీ భాస్కర్ లాంటి సినిమాలు పోటీగా రిలీజైనా.. వాటి ధాటిని తట్టుకొని నిలబడింది. ఇప్పుడు గురువారం (నవంబర్ 28) నుంచి ఈటీవీ విన్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ఈ సినిమాకు ఓటీటీలో మరింత ఆదరణ లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. క సినిమా రూ.22 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కగా.. బాక్సాఫీస్ వద్ద రూ.40 కోట్ల వరకూ వసూళ్లని రాబట్టింది. మిస్టరీ థ్రిల్లర్ సినిమాలంటే చూసేవారు కాదు.. ఫ్యామిలీ ఆడియెన్స్ కూడా క సినిమా చూసి ఎంజాయ్ చేయవచ్చు. క సినిమాలో కిరణ్ అబ్బవరానికి జోడీగా నయన్‌ సారిక నటించగా.. తన్వీ రామ్‌, అచ్యుత్‌కుమార్‌, రెడిన్‌ కింగ్‌స్లే కీలక పాత్రలు పోషించారు. చింతా గోపాలకృష్ణ ఈ సినిమాని నిర్మించారు.

లక్కీ భాస్కర్
దుల్కర్ సల్మాన్ నటించిన మరో మూవీ లక్కీ భాస్కర్. వెంకీ అట్లూరి డైరెక్ట్ చేసిన ఈ సినిమా కూడా దీపావళి సందర్భంగా అక్టోబర్ 31నే రిలీజై మంచి వసూళ్లు రాబట్టింది. ఇప్పుడీ మూవీ గురువారం (నవంబర్ 28) నుంచి నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. “ఇంకా ఒక్క రోజులో అదృష్టం భాస్కర్ తలుపు తడుతుంది. భాస్కర్ మీ తలుపు తడతాడు. రేపటి నుంచి లక్కీ భాస్కర్ మూవీని తెలుగు, తమిళం,మలయాళం, కన్నడ, హిందీల్లో చూడండి” అనే క్యాప్షన్ తో నెట్‌ఫ్లిక్స్ ఓ ట్వీట్ చేసింది. లక్కీ భాస్కర్ మూవీ ఓటీటీ హక్కుల్ని నెట్‌‌ఫ్లిక్స్ మంచి ఫ్యాన్సీ ధరకి దక్కించుకుంది. మూవీ ఇప్పటికే థియేటర్ల నుంచి కనుమరుగు కావడంతో.. స్ట్రీమింగ్‌కి సిద్ధమైంది. లక్కీ భాస్కర్ సినిమా బడ్జెట్ రూ.56 కోట్లుకాగా.. ఇప్పటి వరకూ ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ.109.82 కోట్లని వసూలు చేసింది. కుటుంబం కోసం సాధారణ బ్యాంక్ ఉద్యోగి రిస్క్ చేయడాన్ని కథాంశంగా తీసుకుని.. దర్శకుడు వెంకీ అట్లూరి మిడిల్ క్లాస్ ఆడియెన్స్‌కి కనెక్ట్ అయ్యేలా తెరకెక్కించారు. భాస్కర్ కుమార్‌గా దుల్కర్ సల్మాన్ నటించగా.. సర్దుకుపోయే మధ్యతరగతి భార్య సుమతిగా మీనాక్షి చౌదరి నటించింది.

రెండున్నరేళ్ల తర్వాత తెలుగులో వస్తున్న మలయాళ సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ
మలయాళం మూవీ.. అందులోనూ సైకలాజికల్ థ్రిల్లర్.. తెలుగులో స్ట్రీమింగ్.. ఇది చాలు ఇక్కడి ప్రేక్షకులు ఆ సినిమాపై ఆసక్తి కనబరచడానికి. ఇప్పుడలాంటిదే ఓ మూవీ డిజిటల్ ప్రీమియర్ కు సిద్ధమైంది. ఈ సినిమా పేరు నారదన్. మలయాళ స్టార్ టొవినో థామస్ నటించిన ఈ సినిమా సుమారు రెండున్నరేళ్ల తర్వాత ఓటీటీలోకి వస్తోంది.

నారదన్ ఓటీటీ రిలీజ్ డేట్
మలయాళం ఇండస్ట్రీ నుంచి వచ్చిన మరో ఇంట్రెస్టింగ్ సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ నారదన్. మార్చి, 2022లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఇప్పుడు శుక్రవారం (నవంబర్ 29) నుంచి ఆహా వీడియో ఓటీటీలో తెలుగులో స్ట్రీమింగ్ కు వస్తోంది. “ప్రతి మనిషి ఓ హెడ్‌లైనే. అతి త్వరలో నారదన్ బులిటెన్. నారదన్ నవంబర్ 29 నుంచి ఆహాలో” అనే క్యాప్షన్ తో బుధవారం (నవంబర్ 27) ఈ మూవీ స్ట్రీమింగ్ తేదీని ఆహా వీడియో రివీల్ చేసింది. ఈ వరల్డ్ డిజిటల్ ప్రీమియర్ కోసం తెలుగు ప్రేక్షకులు కూడా ఆతృతగా ఎదురు చూస్తున్నారు.

నారదన్ మూవీ స్టోరీ ఏంటంటే?
టొవినో థామస్ నటించిన నారదన్ మూవీ మార్చి 3, 2022లో థియేటర్లలో రిలీజైంది. ఆశిఖ్ అబు డైరెక్ట్ చేసిన ఈ మూవీలో టొవినో థామస్ తోపాటు అన్నా బెన్, షరాఫుద్దీన్ ప్రధాన పాత్రల్లో నటించారు. నారద న్యూస్ అనే ఛానెల్ నడిపే చంద్రప్రకాశ్ (టొవినో థామస్) అనే పేరు మోసిన జర్నలిస్టు చుట్టూ తిరిగే కథే ఈ నారదన్. నైతిక విలువలు పాటించే జర్నలిస్టుగా ఉన్న అతడు.. తర్వాత పై వాళ్ల నుంచి ఒత్తిడితో టీఆర్పీల కోసం వాటిని పక్కన పెడతాడు. టీఆర్పీల కోసం టీవీ ఛానెల్స్ ప్రజలను ఎలా తప్పుదారి పట్టిస్తాయి? ఎలాంటి సంచలనాలను క్రియేట్ చేస్తాయన్నది ఈ మూవీలో డైరెక్టర్ కళ్లకు కట్టినట్లు చూపించాడు. ఫస్ట్ హాఫ్ కాస్త నెమ్మదిగా సాగినా.. సెకండాఫ్ ఆకట్టుకుంటుంది. అయితే నారదన్ మూవీ తెలుగులోనూ వస్తుండటంతో ఓటీటీలో మంచి ఆదరణ లభించే అవకాశం ఉంది. ఈ సినిమాను శుక్రవారం (నవంబర్ 29) నుంచి ఆహా వీడియో ఓటీటీలో చూడొచ్చు.

==
ఈ వారం ఓటీటీలో రిలీజ్ అయ్యే చిత్రాలు, వెబ్‌ సిరీస్‌ లు ఇవే.
==
అమెజాన్‌ ప్రైమ్‌ :
బ్లడీ బెగ్గర్‌ (తమిళ్‌) నవంబరు 29 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

నెట్‌ఫ్లిక్స్‌ :
సికిందర్‌ క ముకద్దర్‌ (హిందీ) నవంబరు 29 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.
ది గ్రేట్‌ ఇండియన్‌ కపిల్‌ (టాక్‌ షో) నవంబరు 30వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.
ది ట్రంక్‌ (కొరియన్‌) నవంబరు 29 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.
అవర్‌ లిటిల్‌ సీక్రెట్‌ నవంబరు 27 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.
ఫైండ్‌ మి ఇన్‌ పారిస్‌ (ఇంగ్లీష్‌) నవంబరు 28 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.
ది స్నో సిస్టర్‌ (ఇంగ్లీష్‌) నవంబరు 29 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.
ది మ్యాడ్‌నెస్‌ (ఇంగ్లీష్‌) నవంబరు 28 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

డిస్నీ+హాట్‌స్టార్‌ :
పారాచూట్‌ నవంబరు (వెబ్‌సిరీస్‌) నవంబరు 29 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

జీ5 :
వికటకవి (వెబ్‌సిరీస్‌) నవంబరు 28వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.
డివోర్స్‌ కే లియా కుచ్‌ బీ కరేగా (హిందీ) నవంబరు 29 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

సన్‌ నెక్ట్స్‌ :
కృష్ణం ప్రణయ సఖి (కన్నడ) నవంబరు 29వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

అధికారంలోకి వచ్చాక వడ్డీతో సహా చెల్లిస్తాం అన్న కేటీఆర్ వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..!
- Advertisment -

Most Popular