Saturday, December 28, 2024

కీల‌క సూత్ర‌దారి అరెస్ట్‌

ల‌గ‌చ‌ర్ల ఘ‌ట‌న‌లో మ‌లుపు
పోలీసుల ఎదుట లొంగిపోయిన సురేశ్‌

ల‌గ‌చ‌ర్ల ఘ‌ట‌న‌లో కీల‌క సూత్ర‌దారి పోలీసుల ముందు లొంగిపోయాడు. రైతుల‌ను రెచ్చ‌గొట్టి, అధికారుల‌పై దాడులు చేసిన సురేశ్ ఎట్ట‌కేల‌కు పోలీసుల ముందుకు వ‌చ్చాడు. దాదాపు ఆరు రోజుల నుంచి క‌నిపించ‌కుండా తిరుగుతున్న సురేశ్ లొంగిపోవ‌డంతో పోలీసులు ఆయ‌న్ను కొడంగ‌ల్ కోర్టుకు తీసుకెళ్లారు. కొడంగ‌ల్ కోర్టులో ప్ర‌వేశ‌పెట్టిన త‌ర్వాత జ‌డ్జి నిర్ణ‌యం అనంత‌రం చ‌ర్య‌లు తీసుకోనున్నారు. అయితే, సురేశ్‌ను విచారించేందుకు పోలీసులు క‌స్ట‌డీ పిటిష‌న్ సైతం సిద్ధం చేస్తున్నారు.
ల‌గ‌చ‌ర్ల దాడి కేసులో సురేశ్‌ను విచారిస్తేనే కీల‌క అంశాలు వెలుగులోకి వ‌స్తాయ‌ని పోలీసులు భావిస్తున్నారు. ఈ కేసులో ఇప్ప‌టికే మాజీ ఎమ్మెల్యే ప‌ట్నం న‌రేంద‌ర్ రెడ్డి అరెస్ట్ అయిన విష‌యం తెలిసిందే.

ప్ర‌దాన వార్త‌లు

అల్లు అర్జున్ పట్ల రేవంత్ రెడ్డి దారుణంగా వ్యవహరిస్తున్నారన్న డీకే అరుణ వ్యాఖ్యలను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com