మాజీ మంత్రి, వైసీపీ నేత అయిన కొడాలి నాని అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతం హైదరాబాద్ లో ఉంటున్న కొడాలి నాని ఛాతీ నొప్పికి గురయ్యారు. దీంతో, ఆయన కుటుంబ సభ్యులు ఆయనను హుటాహుటిన గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో ప్రస్తుతం ఆయనకు చికిత్స కొనసాగుతోంది. గతంలో కూడా నాని గుండె సంబంధిత సమస్యలతో బాధ పడ్డారు. ఈ నేపథ్యంలో, గుండె సమస్య కారణంగా ఇప్పుడు ఆయనకు ఛాతీ నొప్పి వచ్చిందా? లేదా గ్యాస్ట్రిక్ సమస్యలతో వచ్చిందా? అనే కోణంలో డాక్టర్లు పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇంకోవైపు కొడాలి నాని ఆసుపత్రిలో చేరారనే సమాచారంలో వైసీపీ శ్రేణులు, ఆయన అనుచరులు ఆందోళనకు గురవుతున్నారు.