Thursday, December 26, 2024

క్రిష్‌కి మళ్ళీ పెళ్ళి?…పెళ్ళి కూతురు ఎవరో తెలిస్తే షాక్‌?

ప్రముఖ సినీ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి రెండో వివాహానికి సిద్ధమవుతున్నారన్న వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కొన్నాళ్ల క్రితం రమ్య అనే వైద్యురాలిని క్రిష్ వివాహం చేసుకున్నారు. అయితే వారి వివాహ బంధంలో సమస్యలు ఎదురవ్వడంతో పరస్పర అంగీకారంతో ఆమధ్య విడాకులు తీసుకున్నారు.
ఈ నేపథ్యంలో క్రిష్ మరో వివాహానికి సిద్ధం అవుతున్నారని, వచ్చే వారం వివాహ నిశ్చితార్ధ వేడుక జరగనుందన్న వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. క్రిష్ రెండో వివాహం చేసుకోబోయేది కూడా వైద్యురాలేనని తెలుస్తోంది. అయితే ఆమెకు 11 ఏళ్ల కుమారుడు ఉన్నాడని, ఆమె మొదటి భర్తతో డైవర్స్ తీసుకున్నట్లుగా చెబుతున్నారు. అయితే క్రిష్ రెండో వివాహానికి సంబంధించి అధికారికంగా సమాచారం లేదు.
ఇకపోతే ఇండస్ట్రీలో డైరెక్టర్లు, నటులు ఇలా సెలబ్రెటీలందరికీ ఇది చాలా కామన్‌ అయిపోయిందని చెప్పాలి. వివాహం చేసుకోవడం ఎక్కడైనా ఇద్దరికీ సెట్‌ అవ్వకపోతే చాలా ఈజీగా విడిపోవడం కూడా జరుగుతుంటుంది. ఇక పెళ్లిబంధం అంటే చాలా పవిత్రమైందని దానికి కట్టుబడి ఉండాలన్నది ప్రస్తుతం ఎవ్వరూ చూడడం లేదు. చిన్న చిన్న విషయాలకి కూడా విడిపోయి బ్రతుకుదాం అనే నిర్ణయానికి వచ్చేస్తున్నారు.

 

ప్ర‌దాన వార్త‌లు

అల్లు అర్జున్ పట్ల రేవంత్ రెడ్డి దారుణంగా వ్యవహరిస్తున్నారన్న డీకే అరుణ వ్యాఖ్యలను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com