బీజేపీ, బీఆర్ ఎస్ నాయకుల తీరిది
మహారాష్ట్ర లో గెలిచేది కాంగ్రెస్ పార్టీనే
మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్
మహారాష్ట్ర ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటేయొద్దంటున్న కేసీఆర్ పరోక్షంగా బీజేపీకి ఓటేయమని అన్నట్లేగా అని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ ఎద్దేవా చేశారు. ఢిల్లీలో గస్తీ గల్లీలో కుస్తీ అన్నట్టుగా బీజేపీ, బీఆర్ె ఎస్ పార్టీల నాయకుల తీరు ఉందని అన్నారు. సోమవారం మహారాష్ట్రలోని రాజురా నియోజకవర్గం ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు వెళ్తున్న క్రమంలో గోదావరిఖని లోని రామగుండం ఎమ్మెల్యే మక్కాన్సింగ్ రాజ్ ఠాగూర్ క్యాంపు కార్యాలయంలో రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మహారాష్ట్ర ఎన్నికలలో గెలిచేది కాంగ్రెస్ పార్టీ అని ధీమా వ్యక్తం చేశారు. కేటీఆర్ మహారాష్ట్ర ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయద్దు అంటున్నారని, ఆయన ఉద్దేశం ప్రకారం బీజేపీకి ఓటు వేయాలని అన్నట్టే అన్నారు.