Tuesday, December 24, 2024

తాగితే తాగా.. నేను ఏసీపీని.. నా కారే ఆపుతారా ..?

మద్యం తాగి వాహనాలు నడుపుతున్నవారిపై పోలీసులు కొరడా ఝళిస్తుంటే.. మరో వైపు డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌లో సిద్ధిపేట ట్రాఫిక్‌ ఏసీపీ సుమన్‌కుమార్‌ పట్టుబడ్డారు. హైదరాబాద్‌లోని మధురానగర్‌లో తనిఖీలు చేస్తుండగా ఏసీపీ పట్టుబడ్డాడు. బ్రీత్ ఎనలైజర్‌ పరీక్షల్లో సహకరించకుండా నానా రభస చేశాడు. తాగిన మత్తుల వాహనం నడపడంతో పాటు ట్రాఫిక్‌ పోలీసులతో వాగ్వాదానికి దిగాడు ఈ పోలీసు.. సిద్ధిపేట ట్రాఫిక్‌ ఏసీపీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇదే సమయంలో అక్కడున్న పలువురు ఏసీబీ వ్యవహారంపై ఆశ్చర్యపోయారు. ప్రజలకు చెప్పాల్సిన పోలీసు ఇలా చేయడమేంటనున్నారు.

వివరాల్లోకి వెళ్తే.. బుధవారం రాత్రి మధునాగర్ సమీపంలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో సిద్దిపేట ట్రాఫిక్ ఏసీపీ సుమన్ కుమార్ వాహనాన్ని పోలీసులు ఆపారు. ఈ క్రమంలో బ్రీత్ ఎనలైజర్‌ పరీక్షల్లో సహకరించకుండా అడ్డుకున్నాడు. తాను పోలీసునే అంటూ వాగ్వాదానికి దిగాడు. ఎంత ప్రయత్నించినా సుమన్ కుమార్ బ్రీత్ ఎనలైజర్ ముందు ఊదకపోవడంతో.. ట్రాఫిక్ పోలీసులు లా అండ్ ఆర్డర్ పోలీసులకు సమాచారం అందించారు. వాళ్లు వచ్చి ఏసీపీని అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు పోలీసుల సమక్షంలో కారు నడిపిన జైపాల్ రెడ్డి అనే వ్యక్తికి బ్రీత్ అనలైజర్ పరీక్షలు నిర్వహించగా ఎక్కువ మోతాదులో మద్యం సేవించినట్లు గుర్తించారు. విధులు అడ్డగించిన ఎసిపి సుమన్ కుమార్‌తో పాటు మరో ముగ్గురి మీద కేసు నమోదు చేసి నిందితుల్ని పోలీసులు అరెస్టు చేశారు.

ప్ర‌దాన వార్త‌లు

దురుద్దేశంతోనే తనపై కేసు పెట్టారన్న కేటీఆర్ వ్యాఖ్యలను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com