Tuesday, May 6, 2025

తిరుపతి లడ్డూ అవినీతి వ్యవహారంపై సిబిఐతో విచారణ జరిపించాలి

రాజ్యసభ మాజీ ఎంపి, కాంగ్రెస్ సీనియర్ నేత వి. హనుమంతరావు డిమాండ్
దేవుడి దగ్గర కూడా అవినీతా? ఈ వ్యవహారంపై కేంద్రం సిబిఐతో విచారణ జరిపించాలని రాజ్యసభ మాజీ ఎంపి, కాంగ్రెస్ సీనియర్ నేత వి. హనుమంతరావు డిమాండ్ చేశారు. తిరుపతి లడ్డూలో పంది కొవ్వు, ఫిష్ ఆయిల్స్ వాడుతున్నారని ఎన్డీడిబి ల్యాబ్ రిపోర్టులో వెల్లడైన విషయం తెలిసిందే. దీనిపై గాంధీభవన్‌లో మీడియా సమావేశంలో స్పందించిన విహెచ్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు.

ఇంతకంటే అపచారం తన జీవితంలో చూడలేదని, దేవుడి దగ్గర కూడా అవినీతి చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన వడ్డీ కాసుల వాడని, తప్పు చేసినా, అపచారం చేసినా ఏ ఒక్కరిని విడచిపెట్టరని ఆయన హెచ్చరించారు.

దేవుడి లడ్డూలో ఏవేవో కలిపినట్లు ల్యాబ్ రిపోర్టులో వెల్లడైందని, దీనిపై టిడిపి వాళ్లు కావాలనే చేశారని ఆరోపణలు చేసే అవకాశం ఉందని తెలిపారు. ఇక ఈ వ్యవహారంపై తక్షణమే సిబిఐ విచారణ చేయించాలని, కేంద్రంలో ఉన్న ప్రధాని మోడీ, అమిత్ షాలు ఈ ఘటనపై స్పందించి, సిబిఐ విచారణకు ఆదేశించాలని విహెచ్ కోరారు

ప్ర‌దాన వార్త‌లు

రాహుల్ గాంధీని విమర్శించే నైతిక అర్హత కేసీఆర్‌కు లేదన్న జగ్గారెడ్డి వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com