Tuesday, November 19, 2024

తెలంగాణ చైతన్య రాజధాని వరంగల్

వ‌రంగ‌ల్ లో సీఎం రేవంత్ రెడ్డి ప‌ర్య‌ట‌న‌
కాళోజీ క‌ళాక్షేత్రం ప్రారంభం

వ‌రంగ‌ల్ అంటేనే తెలంగాణ చైత‌న్య రాజ‌ధాని అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. మంగ‌ళ‌వారం సీఎం రేవంత్ రెడ్డి వ‌రంగ‌ల్‌లో ప‌ర్య‌టించారు. దాదాపు రూ. 5 వేల కోట్ల అభివృద్ధి ప‌నుల‌కు శంకుస్థాప‌న‌, ప్రారంభోత్స‌వాలు చేశారు. కాళోజీ క‌ళా క్షేత్రాన్ని ప్రారంభించారు. ప్ర‌జా పాల‌న విజ‌యోత్స‌వ స‌భ‌లో ప్ర‌సంగించారు. కాగా, వ‌రంగ‌ల్‌కు వెళ్లే ముందుకు సీఎం రేవంత్ రెడ్డి ఎక్స్ వేదిక‌గా పోస్ట్ చేశారు. కాళోజీ, పీవీ, జయశంకర్, సమ్మక్క-సారలమ్మ, ఐలమ్మలను సీఎం గుర్తు చేసుకున్నారు. వరంగల్ దశ-దిశను మార్చేందుకు వస్తున్నామంటూ సీఎం చెప్పారు.
వరంగల్ ఆర్ట్స్ కాలేజీ మైదానంలో ప్రభుత్వం ఆధ్వర్యంలో ‘ప్రజాపాలన-విజయోత్సవాలు’ పేరుతో సభకు హాజ‌ర‌య్యారు. ట్వీట్‌లో తెలంగాణ చైతన్య రాజధాని వరంగల్ అంటూ ట్వీట్‌ను ప్రారంభించారు. “కాళోజీ నుంచి పీవీ వరకు, మహనీయులను తీర్చిదిద్దిన నేల… స్వరాష్ట్ర సిద్ధాంతకర్త జయశంకర్ సారుకు జన్మనిచ్చిన గడ్డ… హక్కుల కోసం పోరాడిన సమ్మక్క సారలమ్మ నడయాడిన ప్రాంతం… దోపిడీకి వ్యతిరేకంగా పిడికిలి బిగించిన చాకలి ఐలమ్మ యుద్ధ క్షేత్రం… ఈ వరంగల్” అంటూ రాసుకొచ్చారు. వీరందరి స్ఫూర్తితో… మనందరి భవిష్యత్తు కోసం… వరంగల్ దిశ-దశను మార్చేందుకు ఈరోజు వరంగల్ వస్తున్నానని ఎక్స్ వేదికగా పేర్కొన్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

బోనస్ ఇచ్చి ధాన్యం కొంటున్నట్టు రేవంత్ రెడ్డి మహారాష్ట్రలో గప్పాలు కొట్టాడు అన్న హరీశ్ రావు వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..!
- Advertisment -

Most Popular