Tuesday, February 25, 2025

తెలంగాణలో మద్యం దుకాణాలు బంద్‌

మద్యం ప్రియులకు షాకింగ్‌ వార్త. తెలంగాణలో మూడు రోజుల పాటు మందు షాపులు క్లోజ్ కానున్నాయి. రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో మద్యం షాపులు బంద్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఏకంగా మూడు రోజుల పాటు మద్యం దుకాణాలు మూతపడనున్నాయి. ఇందుకు ఎమ్మెల్సీ ఎన్నికలే కారణం. రాష్ట్రంలోని ఏడు ఉమ్మడి జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగనున్నాయి. ఇప్పటికే ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చేసింది. ఆయా ప్రాంతాల్లో అభ్యర్ధులు ప్రచారాలు కూడా నిర్వహిస్తున్నారు. ఈనెల 27న తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగనున్నాయి. అయితే ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్నికలు జరిగే తేదీతో పాటు మరో రెండు రోజుల పాటు మద్యం దుకాణాలను మూసివేయాలని సర్కార్ నిర్ణయించింది. దీంతో 25 నుంచి లిక్కర్‌ షాప్‌లను మూసివేయనున్నారు.
ఈ నెల 25 నుంచి 27 వరకు వైన్ షాప్స్ క్లోజ్ అవుతాయని ఎక్సైజ్ శాఖ అధికారులు ప్రకటించారు. ఫిబ్రవరి 25న సాయంత్రం 4 గంటల నుంచి 27 సాయంత్రం 4 గంటల వరకు మద్యం దుకాణాలను బంద్ చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు. వైన్‌ షాపులతో పాటు కల్లు దుకాణాలు, బార్లు, రెస్టారెంట్లు కూడా మూసివేయనున్నట్లు తెలిపారు. అలాగే హైదరాబాద్ సిటీ శివారులు మద్యం షాపులు పూర్తి బంద్ అవనున్నట్లు ఎక్సైజ్ శాఖ అధికారులు వెల్లడించారు.
తెలంగాణలో మూడు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి. రెండు ఉపాధ్యాయ, ఒక పట్టభద్రుల స్థానానికి ఎన్నికలు నిర్వహించనున్నారు. మెదక్- నిజామాబాద్- ఆదిలాబాద్-కరీంనగర్ ఉపాధ్యాయ స్థానానికి, అదే స్థానంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా జరగనున్నాయి. ఈ రెండింటితో పాటు వరంగల్-ఖమ్మం-నల్గొండ ఉపాధ్యాయ స్థానానికి ఎన్నికలు జరుగనున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం ఏడు ఉమ్మడి జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో మద్యం షాపులను మూసివేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అలాగే రాచకొండ, సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని పలు గ్రామాల్లో మద్యం షాపులు మూతపడతాయి. యాదాద్రి జిల్లాలో కూడా ఈ నిబంధనలు అమల్లో ఉంటాయి. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరికలు కూడా జారీ చేశారు.
కాగా, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నిక జరుగుతున్న వరంగల్‌-ఖమ్మం – నల్లగొండ నియోజకవర్గంలో గెలుపు కోసం అభ్యర్థుల్లో పోటాపోటీ నెలకొంది. మొత్తం 19 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. అలాగే కరీంనగర్‌-మెదక్‌-నిజామాబాద్‌-ఆదిలాబాద్‌ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కోసం 100 మంది అభ్యర్థులు నామినేషన్లు వేసినప్పటికీ ఉపసంహరణ తర్వాత 56 మంది బరిలో నిలిచారు. అలాగే టీచర్ స్థానంలో 15 మంది పోటీలో ఉన్నారు.

ఓటర్లు ఎంతమందంటే..
మెదక్- నిజామాబాద్- ఆదిలాబాద్-కరీంనగర్ గ్రాడ్యుయేట్స్ నియోజకవర్గంలో మొత్తం 3,55,159 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇందులో 2,26,765 మంది పురుషులు, 1,28,392 మంది మహిళలు ఉండగా.. ఇద్దరు థర్డ్-జెండర్ ఓటర్లు ఉన్నారు. అలాగే మెదక్- నిజామాబాద్- ఆదిలాబాద్-కరీంనగర్ ఉపాధ్యాయ నియోజకవర్గంలో మొత్తం 27,088 ఓటర్లు ఉండగా.. వీరిలో 16,932 మంది పురుషులు, 10,156 మంది మహిళలు ఉన్నారు. దీంతో పాటు వరంగల్-ఖమ్మం-నల్గొండ ఉపాధ్యాయ నియోజకవర్గంలో మొత్తం ఓటర్లు 25,797 మంది ఉండగా.. వీరిలో 15,483 మంది పురుషులు, 10,314 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. వీరంతా ఫిబ్రవరి 27 జరిగే ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. మార్చి 3న ఓట్ల లెక్కింపు జరుగనుంది. ఎమ్మెల్సీ ఎన్నికల కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. పోలింగ్ కేంద్రాల వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు.

ప్ర‌దాన వార్త‌లు

తెలంగాణపై బీజేపీకి చిత్తశుద్ధి లేదని తేలిపోయిందన్న కవిత వ్యాఖ్యలను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com