Wednesday, January 1, 2025

పాలకొల్లులో ‘భైరవం’ క్యూట్ లవ్ సాంగ్ షూట్

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, నారా రోహిత్, మంచు మనోజ్ మోస్ట్ ఎవైటెడ్ క్రేజీ ప్రాజెక్ట్ ‘భైరవం’. విజయ్ కనకమేడల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీ సత్యసాయి ఆర్ట్స్‌పై కెకె రాధామోహన్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని పెన్ స్టూడియోస్‌ డాక్టర్ జయంతిలాల్ గదా సమర్పిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. తాజాగా మేకర్స్ పాలకొల్లు లో సాంగ్ షూటింగ్ మొదలుపెట్టారు. హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, హీరోయిన్ అదితి శంకర్ పై క్యూట్ లవ్ సాంగ్ ని చిత్రీకరిస్తున్నారు.బవిజయ్ పోలాకి మాస్టర్ ఈ సాంగ్ కి కొరియోగ్రఫీ చేస్తున్నారు. శ్రీ చరణ్ పాకాల చార్ట్ బస్టర్ ట్యూన్ ని కంపోజ్ చేశారు. మేకర్స్ షేర్ చేసి స్టిల్స్ లో హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ లుంగీ, షేడ్స్ తో రగ్గడ్ అండ్ మ్యాసీ అవాతర్ లో, హీరోయిన్ అదితి శంకర్ పల్లెటూరి అమ్మాయిగా ఆకట్టుకున్నారు. ఇప్పటికే విడుదల లీడ్ యాక్టర్స్ ఫస్ట్ లుక్ పోస్టర్స్ స్ట్రాంగ్ బజ్‌ను క్రియేట్ చేశాయి. ఈ మూవీలో అదితి శంకర్, దివ్యా పిళ్లై, ఆనంది హీరోయిన్స్ గా నటిస్తున్నారు.

 

ప్ర‌దాన వార్త‌లు

గోటితో పోయే దాన్ని గోడ్డ‌లి వ‌ర‌కు తెచ్చారు... బ‌న్నీ అరెస్ట్‌ వివాదంపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ వ్యాఖ్యలను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com