Tuesday, December 31, 2024

‘పుష్ప-2’ ది కిస్సిక్‌ సాంగ్‌

ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌, బ్రిలియంట్‌ డైరెక్టర్‌ సుకుమార్‌ కాంబినేషన్‌లో రూపొందుతోన్న ఇండియన్‌ బిగ్గెస్ట్‌ ఫిలిం ‘పుష్ప-2’ ది రూల్‌.. చిత్రం ఇప్పుడు ఇండియాలో హాట్‌టాపిక్‌.. సుకుమార్‌ రైటింగ్స్‌ అసోసియేషన్‌తో మైత్రీ మూవీ మేకర్స్‌ పతాకంపై ఇండియాస్‌ ఫేమస్‌ ప్రొడ్యూసర్స్‌ నవీన్‌ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్‌లు ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఇక ఈ చిత్రం గురించి ఏ చిన్న అప్‌డేట్‌ అయినా ప్రేక్షకుల్లో, ఐకాన్‌స్టార్‌ అభిమానుల్లో ఎంతో ఉత్సాహాన్ని నింపుతుంది. ఇటీవల బీహార్‌లోని పాట్నాలో జరిగిన బిగ్గెస్ట్‌ ట్రైలర్‌ ఈవెంట్‌ ఎంతటి సంచలనం సృష్టించిందో అందరికి తెలిసిందే. కనివిని ఎరుగుని జనసంద్రంతో.. ఉప్పొంగిన జనవాహిని సమక్షంలో.. దాదాపు మూడు లక్షల వరకు హాజరైన అభిమానుల సమక్షలంలో ఇండియన్‌ బిగ్గెస్ట్‌ ఫిలిం ‘పుష్ప-2’ దిరూల్‌ ట్రైలర్‌ విడుదలైన సంగతి తెలిసిందే. ఈ ఈవెంట్‌,బిగ్గెస్ట్‌ మాసివ్‌ ట్రైలర్‌ గురించి ఇండియా మొత్తం మాట్లాడుకుంటున్నారు. ట్రైలర్‌ తరువాత సినిమాపై క్రేజ్‌.. అంచనాలు ఆకాశాన్ని అంటుతున్నాయి. పుష్పరాజ్‌గా అల్లు అర్జున్‌ నట విశ్వరూపం డిసెంబరు 5న ప్రపంచమంతా చూడబోతుంది. బ్రిలియంట్‌ దర్శకుడు సుకుమార్‌ టేకింగ్‌… కల్డ్‌ మాస్‌ మేకింగ్‌ గురించి మాట్లాడుకోబోతున్నారు. ఇక ఈ చిత్రంలో అందరూ ఎంతగానో ఎదురుచూస్తున్న ప్రత్యేక పాట అప్‌డేట్‌ వచ్చేసింది. ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌, డ్యాన్సింగ్‌ క్వీన్‌ శ్రీలీలపై చిత్రీకరించిన ఈ పాటను ఈ నెల 24న చెన్నయ్‌లో జరగనున్న గ్రాండ్‌ ఈవెంట్‌లో ఈ కిస్సిక్‌ సాంగ్‌ను గ్రాండ్‌గా ఏడు గంటల రెండు నిమిషాలకు విడుదల చెయ్యబోతున్నారు. ఒకవైపు ఐకాన్‌ స్టార్‌ డ్యాన్సుల గురించి, డ్యాన్సుల్లో ఆయన ఎనర్జీ, ఈజ్‌, స్టయిల్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మరో వైపు డ్యాన్సుల్లో తనకంటూ ఓ ముద్ర వేసుకున్న కథానాయిక శ్రీలీల ఈకాంబోలో ప్రత్యేక గీతం అంటే ఇక ఫ్లోర్‌ ఫైరే… ఈ సాంగ్‌ పుష్ప-2లో మరో సన్సేషన్‌ సాంగ్‌గా నిలవబోతుంది. ఈ ఇద్దరి డ్యాన్సింగ్‌ ఫైర్‌కు రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్‌ బాణీలు తోడైతే.. ఇక మాస్‌.. మాస్‌ జాతరే.. రెడీ టూ వాచ్‌ ఇండియాస్‌ బిగ్గెస్ట్‌ మాస్‌ సాంగ్‌. మాస్‌ మ్యూజికల్‌ బొనాంజ.

ప్ర‌దాన వార్త‌లు

గోటితో పోయే దాన్ని గోడ్డ‌లి వ‌ర‌కు తెచ్చారు... బ‌న్నీ అరెస్ట్‌ వివాదంపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ వ్యాఖ్యలను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com