పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ ఓ సినిమా షూటింగ్‌లో గాయపడ్డారు. దీంతో జపాన్‌లో వచ్చే నెల3న విడుదలయ్యే కల్కి చిత్రం ప్రమోషన్స్‌లో ఆయన పాల్గొనడం లేదు. ఓ సినిమా షూటింగ్ చిత్రీకరణలో చీలమండలి బెనికిందని అందుకే ఆయన హాజరుకావడం కుదరదని ఎక్స్‌వేదికగా ఆయన ప్రకటించారు. సినిమా డిస్ట్రిబ్యూటర్లు చిత్ర యూనిట్ మొత్తం ఈ ప్రమోషన్స్‌లో పాల్గొననుందని తెలిపారు. డార్లింగ్ హీరో ప్రభాస్ ఫ్యాన్స్ ఆయన త్వరగా కోలుకోవాలని సోషల్ మీడియాలో ట్వీట్లు వేస్తున్నారు.