Tuesday, November 26, 2024

భావ వ్యక్తీకరణపై యువగళం యాత్రలో గళమెత్తాను

  • గత పాలకులు రాజ్యాంగ నిబంధనలను పాటించలేదు
  • బాలల రాజ్యాంగం పుస్తకాన్ని విద్యార్థులకు అందిస్తాం
  • స్పూర్తి ప్రదాతల చరిత్రను కూడా పొందుపరుస్తాం
  • 75వ రాజ్యాంగ దినోత్సవంలో మంత్రి నారా లోకేష్

అమరావతి: గత అయిదేళ్లలో రాజ్యాంగం విలువ తెలుసుకున్న మొదటి వ్యక్తిని నేను, ఈ పుస్తకం పట్టుకొని పాదయాత్ర చేశాను, నేను అధికారులతో మాట్లాడేటపుడు కొన్ని అంశాలను మార్కింగ్ చేశాను. ఆర్టికల్ 19 ప్రకారం ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ ప్రెషన్ గురించి అప్పట్లో గళమెత్తానని రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. 75వ రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా అమరావతి సచివాలయంలో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి లోకేష్ మాట్లాడుతూ… నేను పాదయాత్ర చేసేటప్పుడు నాటి పాలకులు, అధికారులు రాజ్యాంగ నిబంధనలను పాటించలేదు. నాతోపాటు అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబును ఎన్నో ఇబ్బందులకు గురిచేశారు. దాని ఫలితంగా గత ఎన్నికల్లో ప్రజలు తీర్పు ఇచ్చారు.

రాజ్యాంగాన్ని కాపాడాల్సిన బాధ్యత అధికారులు, ప్రజాప్రతినిధులపై ఉంది. ఈ సందర్భంగా విద్యా శాఖ మంత్రి గా నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. వచ్చే విద్యా సంవత్సరం నుండి పిల్లలకు కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఫర్ చిల్డ్రన్ అనే పేరుతో ప్రాథమిక హక్కులు, ఇతర అంశాలు, స్వాతంత్య్ర సమర యోధుల చరిత్ర తెలిసే విధంగా బాలల రాజ్యాంగ పుస్తకాలు రూపొందించి అందించాలని నిర్ణయించాం. రాజ్యాంగం ఏమి రాశారనే అంశంపై ప్రజాచైతన్యం అవసరం. లేకపోతే సమాజం నష్టపోతుంది. ప్రిన్సిపల్ జస్టిస్, ఈక్వాలిటీ, ఫ్రెటర్నిటీ వంటి అంశాల గురించి అందరూ తెలుసుకోవాల్సి ఉంది. రాజ్యాంగంపై చైతన్యం కలిగించేందుకు స్కూలు పిల్లలకు ఇంటరాక్టివ్ యాక్టివిటీస్, పజిల్స్, క్విజ్ వంటివి పెట్టాలని నిర్ణయించాం. దేశానికి రోల్ మోడల్స్ అయిన మహాత్మాగాంధీ, నెహ్రూ, అంబేద్కర్, సర్దార్ పటేల్, మౌలానా అజాద్, సర్వేపల్లి రాధాకృష్ణన్ వంటి మహనీయుల ప్రొఫెల్స్ ను పిల్లలకు అందించే బాలల రాజ్యాంగ పుస్తకంలో పొందుపరుస్తాం.

ప్రముఖులతో కమిటీ ఏర్పాటుచేస్తాం

న్యాయ నిపుణులు, విద్యావేత్తలు, పాలసీ మేకర్స్, ప్రజాప్రతినిధులు, చైల్డ్ రైట్ ఆర్గనైజేషన్ ప్రతినిధులతో కమిటీ వేసి, వారి సూచనల మేరకు బుక్ రూపొందించాలని నిర్ణయించాం. ఈ పుస్తకాన్ని స్కూల్ కరిక్యులమ్ లో ఇంటిగ్రేట్ చేస్తాం. టీచర్లకు అవసరమైన శిక్షణ ఇస్తాం. పెద్దఎత్తున లైబ్రరీలకు పంపిణీ చేయాలని నిర్ణయించాం. రాజ్యాంగం అందరికీ సమానంగా అమలుకావాలి. గత అయిదేళ్లుగా రాష్ట్రంలో రాజ్యాంగాన్ని సరిగా అమలుచేయక పోవడంవల్ల ప్రజలంతా నష్టపోయారు, అందులో మేము కూడా ఉన్నాం. అధికారులు రాజ్యాంగాన్ని అందరికీ సమానంగా అమలుచేయాలని కోరుకుంటున్నాను. రాబోయే అయిదేళ్లలో ఆంధ్ర మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్ తేవాలని ముఖ్యమంత్రి చెప్పారు. ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకుని కష్టపడుతున్నాం. రాజ్యాంగంలో ప్రజల కోసం అని ఉంది, నేను మాత్రం పిల్లల కోసం అనే దాన్ని బలంగా నమ్ముతాను. పిల్లలే మన భవిష్యత్తు, పిల్లలే మన సంపద, రాబోయే రోజుల్లో భారతదేశం నెం.1గా ఎదగడం బాలలపైనే ఆధారపడి ఉంది.

రాజ్యాంగం ప్రశ్నించే ధైర్యాన్నిచ్చింది

ఎంతో మంది త్యాగాల ఫలితం స్వాతంత్య్రం. కానీ ప్రజలకు నిజమైన స్వాతంత్య్రం వచ్చింది మాత్రం నవంబర్ 26, 1950. రాజ్యాంగం అమలు అయిన తరువాతే అందరూ సమానం అనే భావన వచ్చింది, మాట్లాడే హక్కు వచ్చింది, ప్రశ్నించే ధైర్యం ఇచ్చింది. స్వేచ్ఛ, సమానత్వం, సోదరభావం అందించింది రాజ్యాంగం. మనతో పాటు అనేక దేశాలు స్వాతంత్య్రం సాధించుకున్నా అభివృద్ధి చెందలేదు, సంక్షోభంలోకి వెళ్లిపోయాయి. కానీ మనం సూపర్ పవర్ గా ఎదుగుతున్నాం. అది మన రాజ్యాంగానికి ఉన్న గొప్పతనం. అనేక కులాలు, భాషలు, ప్రాంతాలు, ఎన్నో సంక్షోభాలు ఎదుర్కున్నా మనం నిలబడ్డాం అది మన రాజ్యాంగం సత్తా. ఈ సందర్భంగా రాజ్యాంగం రూపకర్తలను మనం స్మరించుకోవాలి.

రాజ్యాంగం ముసాయిదా కమిటీ అధ్యక్షుడిగా డాక్టర్. బీఆర్ అంబేద్కర్ గారు చేసిన కృషి ఒక చరిత్ర. సామాన్య దళిత కుటుంబంలో పుట్టి దేశానికి స్వేచ్ఛ, ప్రజలకు ప్రాథమిక హక్కులు, రక్షణ కల్పించిన గొప్ప వ్యక్తి డాక్టర్. బీఆర్ అంబేద్కర్ గారు. రాజ్యాంగం దుర్వినియోగం అయ్యిందని తెలిస్తే దానిని కాల్చే మొదటి వ్యక్తిని నేనే అని ధైర్యంగా చెప్పిన వ్యక్తి డాక్టర్. బీఆర్ అంబేద్కర్ గారు. మన ప్రజాస్వామ్యం బలం మన రాజ్యాంగం. ప్రపంచంలోనే ఉత్తమ రాజ్యాంగం మనది. దీని వెనుక ఎంతో మంది కృషి ఉందని మంత్రి లోకేష్ చెప్పారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

బోనస్ ఇచ్చి ధాన్యం కొంటున్నట్టు రేవంత్ రెడ్డి మహారాష్ట్రలో గప్పాలు కొట్టాడు అన్న హరీశ్ రావు వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..!
- Advertisment -

Most Popular