Saturday, December 28, 2024

భూ కేటాయింపులు చెల్లవు సొసైటీలకు సుప్రీం షాక్

రాష్ట్రంలోని గ్రేటర్ పరిధిలో హౌసింగ్ సొసైటీలకు ప్రభుత్వాలు కేటాయించిన భూములను రద్దు చేస్తూ సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చింది . రావు బి చెలికాని అనే వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ జరిపిన ధర్మాసనం ఈ మేరకు తుది తీర్పు ఇచ్చింది. సొసైటీలు ప్రభుత్వాలకు డబ్బులు చెల్లించి ఉంటే.. ఆ డబ్బులన్నీ ఆయా సొసైటీలకు తిరిగి ఇవ్వాలని ఆదేశించింది. ఈ తీర్పు ప్రకారం గ్రేటర్ పరిధిలో హౌసింగ్ సొసైటీల కోసం ప్రభుత్వం కేటాయించిన భూములన్ని వెనక్కి తీసుకునే అవకాశం ఉంది. ఎప్పటి నుంచి ఎప్పటి వరకూ అనే కాలపరిమితి ఉందా లేదా అన్నదానిపై స్పష్టత రావాల్సి ఉంది. సొసైటీలకు భూముల కేటాయింపు అనేది చాలా కాలంగా ఉంది. ప్రజాప్రతినిధులు, అధికారులు, జర్నలిస్టులకు ఎన్నో ఏళ్లుగా సొసైటీల కింద స్థలాలు కేటాయిస్తూ వస్తున్నారు. జూబ్లిహిల్స్ లో కూడా జర్నలిస్టులు, ఐఏఎస్ అధికారుల సొసైటీలకు స్థలాలు కేటాయించారు. ఇటీవల కూడా రేవంత్ రెడ్డి ఓ జర్నలిస్టు సొసైటీకి సుదీర్ఘ వివాదాల అనంతరం సమస్య పరిష్కరించి ల్యాండ్ వారికి అప్పగించారు. ఎన్జీవోలు గచ్చిబౌలిలో చాలా పెద్ద కాలనీనే సొసైటీ పేరుతో కట్టుకున్నారు. ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పు తర్వాత సొసైటీల పేరుతో స్థలాలు తీసుకుని ఇళ్లు కట్టుకున్న వారికి గడ్డు ప రిస్థితి ఎదురయ్యే అవకాశం ఉంది. తుది తీర్పులో ఏయే సొసైటీలు, ఎప్పటి నుంచి కాలపరిమితి ఉందా అన్న దానిపై క్లారిటీ వస్తే వీరికి టెన్షన్ తీరుతుంది. మొత్తంగా ఇటీవల జర్నలిస్టులు అందరూ సమస్య పరిష్కారం అయిందని సంబరాలు చేసుకున్న స్థలం విషయం మొదటికి వచ్చినట్లయింది.

షాక్
తెలంగాణలో భూ కేటాయింపులై దాఖలైన ప్రజాప్రయోజనాల వ్యాజ్యంపై సర్వోన్నత న్యాయస్థానం సంచలన తీర్పు వెలువరించింది. ప్రజా ప్రతినిధులు, బ్యూరోక్రాట్లు, జర్నలిస్టులకు ప్రభుత్వ భూ కేటాయింపులు రద్దు చేస్తూ సుప్రీం కోర్టు తీర్పునిచ్చింది. వడ్డీతో రిఫండ్‌ చెల్లించాలని ఆదేశించింది. ఈ మేరకు ఇప్పటికే చేసిన అన్ని భూ కేటాయింపులను రద్దు చేయడంతో పాటు డబ్బులు చెల్లించిన వారికి తిరిగి చెల్లించేందుకు ఏర్పాట్లు చేయాలని ఆర్‌బిఐ, రాష్ట్ర ప్రభుత్వాన్ని సీజేఐ నేతృత్వంలోని ధర్మాసనం ఆదేశించింది.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో న్యాయమూర్తులు, బ్యూరోక్రాట్లు, జర్నలిస్టులు, ప్రజాప్రతినిధులకు ఇంటి స్థలాలను కేటాయిస్తూ నాటి ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయాన్ని సవాలు చేస్తూ హైదరాబాద్‌కు చెందిన సామాజిక కార్యకర్త చెలికాని రావు న్యాయపోరాటం చేస్తున్నారు. జర్నలిస్టులు, ప్రజాప్రతినిధులు, బ్యూరోక్రాట్లు, ఐఏఎస్‌,ఐపీఎస్‌, ఐఆర్‌ఎస్‌ అధికారులకు పట్టణ ప్రాంతాల్లో ఇళ్ల స్థలాల కేటాయింపు అధికార దుర్వినియోగమేనని, జీవో నంబర్ 243 జారీ చేయడాన్ని పిటిషనర్‌ సవాలు చేశారు. ప్రభుత్వ వ్యవస్థల్లో భాగమైన జ్యూడిషియల్‌, బ్యూరోక్రాట్స్‌, పొలిటిషియన్స్‌కు ఇళ్ల స్థలాలను కేటాయించడం సరికాదని వాదించారు. ప్రభుత్వ నిర్ణయాన్ని సవాలు చేస్తూ 2008లో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. ప్రభుత్వ ఉద్యోగులకు 400 గజాల నుంచి 100 గజాల ఫ్లాట్లు, జర్నలిస్టులకు 300గజాలు, ఆలిండియా సర్వీస్ అధికారులకు 500గజాలు కేటాయించడాన్ని పిటిషనర్‌ తప్పు పట్టారు. సుదీర్ఘ కాలం పాటు ఈ వ్యవహారంపై కోర్టులో విచారణ జరిగింది. కొద్ది నెలల క్రితమే జర్నలిస్టుల హౌసింగ్ సొసైటీకి రాష్ట్ర ప్రభుత్వం భూమిని కేటాయించింది. తాజాగా భూ కేటాయింపులను సుప్రీం కోర్టు రద్దు చేస్తూ తీర్పు వెలువరించింది.
తాజాగా హైదరాబాద్‌లో జర్నలిస్ట్‌ హౌసింగ్ కో ఆపరేటివ్‌ సొసైటీలో ఏపీ తెలంగాణ రాష్ట్రాలకు చెందిన పలువురు జర్నలిస్టులకు కొద్ది నెలల క్రితం ఇళ్ల స్థలాలను కేటాయించారు. సుప్రీం కోర్టు తీర్పుతో ఏమి జరుగుతుందనే ఆందోళన లబ్దిదారుల్లో నెలకొంది.

 

 

ప్ర‌దాన వార్త‌లు

అల్లు అర్జున్ పట్ల రేవంత్ రెడ్డి దారుణంగా వ్యవహరిస్తున్నారన్న డీకే అరుణ వ్యాఖ్యలను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com