Monday, November 25, 2024

మంత్రి వర్గంలోకి నలుగురు నేడో, రేపో ఖరారు

రాష్ట్ర మంత్రివర్గ విస్తరణకు రంగం సిద్దం అవుతోంది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తవుతోంది. దీంతో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించారు. ఈ నెల 9న సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ జరగనుంది. అదే రోజు నుంచి అసెంబ్లీ సమావే శాల నిర్వహణకు నిర్ణయించారు. కొత్త నిర్ణయాల ప్రకటనకు సిద్దం అవుతున్నారు. ఇదే సమయంలో ఏడాది పాలన పూర్తికి ముందే మంత్రివర్గ విస్తరణ కు ఏఐసీసీ ఆమోదం తెలిపింది. సోమవారం సాయంత్రం ఢిల్లీ వెళ్తున్న సీఎం రేవంత్ పార్టీ ముఖ్యులతో సమావేశం కానున్నారు. మంత్రివర్గకూర్పుపై ఈ భేటీలో చర్చించనున్నారు.

ఈసారి పర్యటనలోనే ఖరారు
మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఫిక్స్ అయింది. చాలా రోజులుగా ముఖ్యమంత్రి రేవంత్ తన కేబినెట్ లో ఖాళీలను భర్తీ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పుడు ప్రభుత్వం ఏర్పాటై ఏడాది పూర్తవుతున్న వేళ ఇక విస్తరణ పూర్తి చేసేందుకు పార్టీ నాయకత్వం అనుమతి ఇచ్చింది. సోమవారం ముఖ్యమంత్రి రేవంత్ ఢిల్లీ వెళ్తున్నారు. ప్రజాపాలన విజయోత్స వాల గురించి వివరించి.. పార్టీ ముఖ్య నేతలను ఈ ఉత్సవాలకు ఆహ్వానించనున్నారు.

రాహుల్ తో భేటీ
రాహుల్ గాంధీతో రేవంత్ ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. మహారాష్ట్ర ఎన్నికల ఫలితాల తరువాత విస్తరణ చేపట్టాలని గతంలోనే రేవంత్ కు ఢిల్లీ నేతలు సూచించారు. దీంతో, ఈ నెల 29న మంత్రివర్గ విస్తరణ ఉంటుందని సమాచారం. కీలకమైన హోం శాఖను సీతక్క ను ఇవ్వనున్నారు. అదే విధంగా విద్యా శాఖ మంత్రివర్గంలోకి కొత్తగా వచ్చే వారిలో ఒకరికి కేటాయిస్తారని తెలుస్తోంది. ఇక.. రాష్ట్రంలో పెండింగ్ హామీల అమలు పైన ఇప్పటికే ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. ఆర్దిక పరిస్థితిని పరిగణలోకి తీసుకొని హామీల అమలు దిశగా అడుగులు వేస్తోంది. పెన్షన్ పెంపు పైన ప్రకటన చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.

కూర్పు – మార్పు
లోక్‌సభ ఎన్నికల ప్రచారం సందర్భంగా ముదిరాజ్‌లకు ప్రాతినిథ్యం కల్పించేందుకు మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరిని మంత్రిగా చేస్తానని ముఖ్యమంత్రి రేవంత్ ప్రకటించారు. మంత్రివర్గ విస్తరణలో శ్రీహరి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, గడ్డం వివేక్‌ల పేర్ ఖరారైనట్లు తెలుస్తోంది. అదే విధంగా.. నిజామాబాద్‌ నుంచి సీనియర్‌ నాయకుడు, బోధన్‌ ఎమ్మెల్యే పి.సుదర్శన్‌రెడ్డి పేరు సైతం బాగా వినిపిస్తోంది. ప్రస్తుత మంత్రివర్గంలో మైనార్టీల నుంచి ఎవరూ లేరు. దాంతో ఆ వర్గం నుంచి ఒకరికి అవకాశం ఉండొచ్చు. ప్రస్తుతం మంత్రివర్గంలోకి నలుగురిని చేర్చుకొని…స్థానిక సంస్థ ల ఎన్నికల తరువాత మంత్రివర్గ ప్రక్షాళన ఉంటుందని సమాచారం.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

బోనస్ ఇచ్చి ధాన్యం కొంటున్నట్టు రేవంత్ రెడ్డి మహారాష్ట్రలో గప్పాలు కొట్టాడు అన్న హరీశ్ రావు వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..!
- Advertisment -

Most Popular