Saturday, May 17, 2025

మ‌ళ్లీ కూల్చివేత‌లు

దూకుడు పెంచిన హైడ్రా
అమీన్‌పూర్ మున్సిపాలిటీ ప‌రిధిలో చ‌ర్య‌లు
ఆక్ర‌మ‌ణ‌లు కూల్చివేసిన హైడ్రా
వ‌న‌స్థ‌లిపురంలో కూడా..!

అక్రమ కట్టడాలపై మ‌ళ్లీ హైడ్రా ఉక్కుపాదం మోపింది. ముఖ్యంగా నగర శివారు ప్రాంతాల్లో ఇబ్బడిముబ్బడిగా వెలిసిన అక్రమ కట్టడాలపై ఫోకస్ చేసింది. ఈ క్రమంలో సోమవారం ఉదయం అమీన్‌పూర్ మున్సిపాలిటీ పరిధిలోని వందనపురి కాలనీలో అక్రమ నిర్మాణంపై కొరడా ఝులిపించింది. సర్వే నంబర్‌ 848 రోడ్డును ఆక్రమించి నిర్మించిన భవనాలను కూల్చివేసింది. రెండు వారాల కిందట నోటీసులు ఇచ్చినప్పటికీ ఇళ్లను తొలగించకపోవడంతో హైడ్రా సీరియస్ అయ్యింది. ఈ క్రమంలో భారీ యంత్రాలతో వాటిని కూల్చివేసింది. అమీన్‌పూర్ మున్సిపాలిటీ పరిధిలో రెండు చోట్ల ఈ అక్రమ నిర్మాణాలను గుర్తించింది. ఇటీవల నాగారం మున్సిపాలిటీలో రోడ్డును ఆక్రమించి నిర్మించిన ఇళ్లు కూల్చివేసిన విషయం తెలిసిందే.
సుప్రీం కోర్టు మార్గ దర్శకాల ప్రకారం ముందుగా నోటీసులు ఇస్తోంది. అందుకు 15 రోజులు గడువు ఇస్తోంది. రెండు వారాల్లో నిర్మాణాలను యజమానులే ఆక్రమణలు తొలగించకపోతే హైడ్రా రంగంలోకి దిగుతోంది.

ఇటు వ‌న‌స్థ‌లిపురంలో..
మరోవైపు వనస్థలిపురం హుడా సాయినగర్ కాలనీలో అక్రమ కట్టడాలపై జీహెచ్ఎంసీ అధికారులు కొరడా ఝులిపించారు. రోడ్ నంబర్-5లో 150 ఫీట్ల పొడవైన రోడ్డును 4 ఫీట్ల వరకు కబ్జా చేశారు. దీనిపై స్థానికుల నుంచి ఫిర్యాదులు జీహెచ్ఎంసీకి వెళ్లాయి. స్థానిక జీహెచ్ఎంసీ అధికారులకు ఎన్నిఫిర్యాదులు చేసినా పట్టించుకోలేదు. చివరకు హైకోర్టు నుండి ఆర్డర్ తీసుకురావడంతో జీహెచ్ఎంసీ అధికారులు కదిలారు.

ప్ర‌దాన వార్త‌లు

కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలపై బీఆర్ఎస్ నేత హరీశ్ రావు తీవ్ర వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com