సిఎంను కలిసి విజ్ఞప్తి చేసిన ఎమ్మెల్యేలు
మాదిగలకు మంత్రి పదవి ఇవ్వాలంటూ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మాదిగ ఎమ్మెల్యేలు వినతి పత్రం సమర్పించారు. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా టీ బ్రేక్ సమయంలో అడ్లూరి లక్ష్మణ్, కవ్వంపల్లి సత్యనారాయణ, మందుల సామ్యేల్, లక్ష్మీ కాంతారావు, వేముల వీరేశంలు సిఎం రేవంత్ రెడ్డిని కలిశారు.
తెలంగాణలో అతిపెద్ద సామాజిక వర్గమైన తమ కమ్యూనిటీకి మంత్రి పదవికి ఇవ్వాలని వారు సిఎంను అభ్యర్థించారు. జనాభా పరంగా గణనీయ సంఖ్యలో ఉన్న తమకు కేబినెట్లో చోటు ఇవ్వాలని వారు కోరుతున్నారు. కాగా, కాంగ్రెస్ ప్రభుత్వంలో మాదిగలకు మంత్రి పదవి ఇవ్వాలని ఆ సామాజిక వర్గ నేతలు డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే.