Monday, April 21, 2025

మాలధారణ ఏంటి… దర్గాలో మొక్కులు ఎందుకు?

– రామ్‌చరణ్‌ తీరుపై అయ్యప్పల ఫిర్యాదు
టాలీవుడ్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అయ్యప్ప దీక్షలో ఉన్న సంగతి తెలిసిందే. దీక్షలో ఉండి కూడా ఆయన ఎ.ఆర్‌. రెహమాన్‌ పిలుపు మేరకు కడప దర్గాను సందర్శించారు. మరి ఈ విషయం ఇప్పుడుపై ఇప్పుడు అంతటా వివాదాస్పదమైంది. మాలధారణ దుస్తుల్లో ఉన్న రామ్ చరణ్ కడప అమీన్ పీర్ దర్గాలో ప్రార్థనల్లో పాల్గొన్నారు. దాంతో ఆయనపై హిందూ మతస్థులు.. మాలధారణలో ఉన్న అయ్యప్పస్వాములు అందరూ విమర్శలు గుప్పిస్తున్నారు.
ఈ నేపథ్యంలో, రామ్ చరణ్ పై శంషాబాద్ లో అయ్యప్పస్వాములు పోలీసులకు ఫిర్యాదు చేశారు. శంషాబాద్ అయ్యప్పస్వామి సొసైటీ సభ్యులు నేడు ఎయిర్ పోర్టు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు పత్రాన్ని అందించారు. రామ్ చరణ్ తన చర్యల ద్వారా అయ్యప్ప భక్తుల మనోభావాలను దెబ్బతీశారని, ఆయన వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కాగా, ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు కేసు నమోదు చేసినట్టు తెలుస్తోంది.
అయితే ఈ ఘటనపై ఆల్రెడీ రామ్‌చరణ్‌ సతీమణి ఉపాసన తన సోషల్‌ మీడియాలో దేవుడు ఎవ్వరైనా ఒకటే అని తన మతంతో పాటు వేరే మతాన్ని కూడా గౌరవించడం తప్పేమి కాదన్నట్లు ఆమె ట్వీట్‌ చేశారు. అయినప్పటికీ ఈ వాదన మాత్రం ఎక్కడా ఆగడం లేదు.

ప్ర‌దాన వార్త‌లు

కేటీఆర్‌కు రాజకీయ ఓనమాలు తెలియవు.. అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్య లను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com