Tuesday, December 24, 2024

మూసీ ద‌గ్గ‌ర ఉందామా.. మీరు సిద్ధ‌మా..? సీఎంకు కిష‌న్ రెడ్డి స‌వాల్‌

మూసీ బాధితుల ఇంట్లోనే రేపు ఉంటామ‌ని, అక్కడే పడుకుంటామని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి స‌వాల్ చేశారు. మూసీ బాధితుల సమస్యలను పరిష్కరించేలా రేవంత్ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తామన్నారు. బీజేపీ కార్యాల‌యంలో ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి చురకలు అంటించారు. పేద ప్రజలకు అన్యాయం చేయొద్దని అంటే బుల్డోజర్‌లతో తొక్కిస్తా అంటావా.. తొక్కించు మేము కూడా చూస్తామని సవాల్ విసిరారు. ‘‘సిస్టం మీకు మాత్రమే ఉందా.. మాకు లేదా.. చట్టం లేదా’’ అని ప్రశ్నించారు. అధికారంలో ఉన్నామని ఏది పడితే అది మాట్లాడితే ఎలా అని ప్రశ్నించారు. రేవంత్ ఇలా మాట్లాడితే పేదల కోసం తాము చావడానికి కూడా సిద్ధమని అన్నారు. ముఖ్య మంత్రి రేవంత్‌రెడ్డి సవాల్‌‌ను తాము స్వీకరిస్తున్నామన్నారు. వారి కోసం తమ పదవులు త్యాగం చేసేందుకు తాము రెడీగా ఉన్నామని కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు.

రేపు ముసీ బాధితుల ఇంట్లోనే ఉంటాం…
‘‘మా ఎమ్మెల్యే , ఎంపీ పదవులు వదులుకునేందుకు రెడీ. రేపు(శనివారం) రాత్రి బీజేపీ అధ్వర్యంలో మూసీ బాధితుల ఇంట్లోనే ఉంటాం, అక్కడే పడుకుంటాం. మా పార్టీ ఎంపీలు , ఎమ్మెల్యేలు మూసీ , హైడ్రా బాధితుల ఇళ్లలో ఉండాలని నిర్ణయించాం. ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలన్ని నెరవేరుస్తే మేము మూడు నెలలు అక్కడే ఉండేందుకు సిద్ధం. వచ్చే రోజులన్నీ బీజేపీవే. రాబోయే రోజుల్లో మీమే అధికారంలోకి రాబోతున్నం. కేటీఆర్ అరెస్ట్ అంటూ కాంగ్రెస్ డ్రామా ఆడుతుంది’’ అని కిషన్‌రెడ్డి విమర్శించారు.
‘‘రేవంత్ రెడ్డి తెలంగాణలో ఏం చేశారో చెప్పి మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో పాల్గొనాలి. నువ్వు సీఎం అయ్యాక చేసింది ఏంటంటే రెచ్చగొట్టే ప్రసంగాలు , విద్వేష పూరిత వ్యాఖ్యలు తప్ప ఏం ఉంది. మాజీ సీఎం కేసీఆర్ తిట్టినా తిట్ల పురాణాన్ని రేవంత్ రెడ్డి , కేటీఆర్‌లకు అందించినట్లు ఉంది. కేసీఆర్ , రేవంత్ రెడ్డిలు నిరుద్యోగులకు ఏం చేశారు. ధాన్యం కొనుగోళ్లలో ఫెయిల్ అయ్యారు. ఏ మొహం పెట్టుకుని మహారాష్ట్ర రైతులకు హామీ ఇస్తున్నారు. కౌలు రైతులు , రైతు కూలీల హామీలు ఏమయ్యాయి. 11నెలల్లో ఎంతమందికి రుణామాఫీ చేశారు. పోలీసులు గతంలో ఫామ్‌హౌస్‌ల కోసం పని చేశారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి కోసం పనిచేస్తున్నారు. హైదరాబాద్‌లో దేవాలయాలపై దాడులు జరుగుతుంటే ఏం చేస్తున్నారు.మజ్లిస్ ఆదేశాలకు తలొగ్గి రాహుల్ గాంధీ ద్వారా అసదుద్దీన్ ఓవైసీ హైదరాబాద్ నగర కమిషనర్‌ను ట్రాన్స్‌ఫర్ చేశారు. ఇక్కడ ఇవన్నీ చాలవన్నట్లు మహారాష్ట్ర ప్రచారానికి రేవంత్ వెళ్తున్నారు. కలెక్టర్ల మీద దాడులు, రైతుల మీద కేసులు తప్పా రేవంత్ రెడ్డి సర్కార్ ఏం చేస్తుంది. జీహెచ్ఎంసీ కాంట్రాక్టర్లకు కోట్ల రూపాయాలు పెండింగ్‌లో ఉన్నాయి. కేసీఆర్ పుణ్యమా అని రూ. 8లక్షల కోట్లు అప్పు ఏర్పడింది. కేసీఆర్ , రేవంత్ రెడ్డి వైఖరీ ఓటు బ్యాంకు రాజకీయం చుట్టూ తిరుగుతుంది’’ అని కిషన్ రెడ్డి విమర్శించారు.

ప్ర‌దాన వార్త‌లు

దురుద్దేశంతోనే తనపై కేసు పెట్టారన్న కేటీఆర్ వ్యాఖ్యలను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com