Thursday, January 9, 2025

మెగా ఇంట్లోకి రీతూవర్మ

పెళ్ళి చూపులు చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన రీతూవర్మ అందరికీ పరిచయం ఉన్న అచ్చ తెలుగమ్మాయి. తెలుగులో మంచి టాలెంట్ ఉన్న హీరోయిన్లలో ఒకరుగా పేరు తెచ్చుకుంది. స్వాగ్ సినిమాతో పలకరించిన రీతూవర్మ అడపా దడపా సినిమాల్లో నటిస్తూ వస్తూ..తాజాగా స్వాగ్ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. సోషల్ మీడియాలో చురుగ్గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన ఫొటోలను షేర్ చేస్తుంటుంది. మెగా కుటుంబంలో ఎక్కడ ఏ చిన్న ఫంక్షన్ జరిగినా కచ్చితంగా కనపడుతుంది. దీంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. మెగా కుటుంబంతో అంత మెరుగైన సంబంధాలు రీతూవర్మకు ఎలా ఉన్నాయబ్బా అనుకుంటున్నారు. ఒక మెగా హీరోను ప్రేమించిందని, అందుకే అక్కడ జరిగే వేడుకలకు వెళుతుంటుందని, ఆమె ప్రేమను ఇరువైపులా కుటుంబాలు ఒప్పుకున్నాయంటున్నారు. అయితే ఏ మెగా హీరోను పెళ్లి చేసుకుంటుందనే విషయం సస్పెన్స్ గా మారింది. స్టార్ హీరోయిన్ గా మారడానికి ప్రయత్నాలు తెలుగుతోపాటు, తమిళం, మళయాళ భాషల్లో నటిస్తూ స్టార్ హీరోయిన్ గా మారడానికి ప్రయత్నాలు చేస్తున్న అచ్చ తెలుగమ్మాయి రీతూవర్మ చేసుకోబోయే మెగా హీరో ఎవరబ్బా అంటూ సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది. ఒక్కొక్కరు ఒక్కో పేరు చెబుతున్నారు. ప్రస్తుతం మెగా కుటుంబంలో పెళ్లి కాకుండా మిగిలివున్న హీరోలెవరు అనే లెక్క తీస్తున్నారు. ఫలానా హీరో అంటూ ఒకరు కామెంట్ పెడుతుంటే కాదు.. మరో హీరో అంటూ మరో నెటిజన్ కామెంట్ పెడుతున్నారు. ఇంతకీ ఇవరన్న సస్సెన్స్‌ మాత్రం ఇంకా వీడలేదు.

ప్ర‌దాన వార్త‌లు

గోటితో పోయే దాన్ని గోడ్డ‌లి వ‌ర‌కు తెచ్చారు... బ‌న్నీ అరెస్ట్‌ వివాదంపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ వ్యాఖ్యలను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com