Wednesday, May 14, 2025

మే 16 ‘అయ్యనా మానే’ వెబ్ సిరీస్

జీ5 కన్నడ ఒరిజినల్ సిరీస్ ‘అయ్యనా మానే’ రికార్డుల్ని క్రియేట్ చేసింది. ఐఎమ్‌బిడిలో 8.6 రేటింగ్‌తో ఈ వెబ్ సిరీస్ దూసుకుపోతోంది. కుషీ రవి, అక్షయ నాయక్, మానసి సుధీర్ ప్రధాన పాత్రలుగా రమేష్ ఇందిర దర్శకత్వంలో ఈ వెబ్ సిరీస్ రూపొందింది. కన్నడ, హిందీ, తమిళ భాషలలో ఇప్పటికే భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ గ్రిప్పింగ్ ఫ్యామిలీ థ్రిల్లర్ ఇప్పుడు మే 16, 2025న తెలుగులో విడుదల కానుంది. దీంతో దక్షిణ భారతదేశం అంతటా ‘అయ్యనా మానే’ పరిధిని మరింత విస్తృతం కానుంది. చిక్ మంగళూర్ నేపథ్యంలో ఈ కథ సాగుతుంది. ముగ్గురు కోడళ్ల రహస్య మరణాల చుట్టూ ఈ కథనం తిరుగుతుంది. ప్రతి మరణం కల దేవత కొండయ్యకు సంబంధించిన శాపం వల్లే జరుగుతుందని నమ్ముతుంటారు. జాజీ (ఖుషీ రవి) కుటుంబంలోకి ప్రవేశించినప్పుడు తన ప్రాణాలను బలిగొంటుందని ఇట్టే గ్రహిస్తుంది. నమ్మకమైన పనిమనిషి తాయవ్వ, సిన్సియర్ ఆఫీసర్ మహానేష్ మద్దతుతో ఇంటి రహస్యాలను బయటకు తీసుకు వస్తూ ఉంటుంది. సస్పెన్స్, థ్రిల్లర్‌, ఫ్యామిలీ అంశాలతో తెరకెక్కించిన ఈ కథ ఓటీటీలో అందరినీ ఆకట్టుకునేలా ఉంటుంది.

ప్ర‌దాన వార్త‌లు

రాహుల్ గాంధీని విమర్శించే నైతిక అర్హత కేసీఆర్‌కు లేదన్న జగ్గారెడ్డి వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com