Wednesday, December 25, 2024

రామ్‌గోపాల్‌ వర్మకి నోటీసులు

వివాదాస్పద ద‌ర్శ‌కుడు రామ్‌గోపాల్ వ‌ర్మకు ఒంగోలు పోలీసులు నోటీసులు ఇచ్చారు. మంగళవారం రాత్రి హైదరాబాద్‌కు బయల్దేరి ఎస్‌ఐ శివరామయ్య ఆధ్వర్యంలోని బృందం నేడు ఆయనకు నోటీసులు అందజేశారు. ఈ విష‌యాన్ని ఒంగోలు గ్రామీణ సీఐ ఎన్. శ్రీకాంత్ ధ్రువీక‌రించారు.

ఏపీ అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు ముందు వ్యూహం సినిమా ప్ర‌మోష‌న్స్ స‌మ‌యంలో ఆర్‌జీవీ.. అప్ప‌టి ప్ర‌తి ప‌క్ష‌నేత, టీడీపీ అధినేత చంద్ర‌బాబు నాయుడు, ఆయ‌న కుటుంబ స‌భ్యుల‌తో పాటు జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ల్యాణ్ వ్య‌క్తిత్వాల‌ను కించ‌ప‌రిచేలా ఎక్స్ (ట్విట్ట‌ర్‌)లో పోస్టులు పెట్టారంటూ ప్ర‌కాశం జిల్లా ‌మద్దిపాడు పీఎస్‌లో కేసు న‌మోదైంది.

ఈ కేసులో భాగంగా విచార‌ణ‌కు హాజరు కావాల‌ని ఆయ‌న‌కు నోటీసులు రెడీ చేశారు. ఈ నేప‌థ్యంలోనే ఒంగోలు పోలీసులు వ్య‌క్తిగ‌తంగా ఆర్‌జీవీకి నోటీసులు ఇచ్చేందుకు హైద‌రాబాద్ రావ‌డం జ‌రిగింది. మార్ఫింగ్‌ చేసిన ఫొటోలను ఎక్స్‌ సోషల్‌ మీడియా ద్వారా పోస్టు చేశారని ఫిర్యాదు నమోదు అయ్యింది.

ప్ర‌దాన వార్త‌లు

అల్లు అర్జున్ పట్ల రేవంత్ రెడ్డి దారుణంగా వ్యవహరిస్తున్నారన్న డీకే అరుణ వ్యాఖ్యలను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com