Friday, May 2, 2025

విశ్వసుందరిగా డెన్మార్క్‌ బ్యూటీ కెజార హెల్విగ్‌

మెక్సికో : మిస్‌ యూనివర్స్‌ పోటీల్లో డెన్మార్క్‌కు చెందిన 21 ఏళ్ల విక్టోరియా కెజార హెల్విగ్‌ విజేతగా నిలిచింది. మెక్సికో వేదికగా జరిగిన మిస్‌ యూనివర్స్‌ 2024 పోటీల్లో 125 మంది పోటీ పడగా.. విక్టోరియా విశ్వసుందరి కిరీటాన్ని దక్కించుకుంది. ఆదివారం జరిగిన మిస్‌ యూనివర్స్‌ 73వ ఎడిషన్‌ పోటీల్లో విజేతగా నిలిచిన విక్టోరియాకు 2023 మిస్‌ యూనివర్స్‌ షెన్నిస్‌ పలాసియోస్‌ విశ్వసుందరి కిరీటాన్ని అలంకరించింది. ఈ మిస్‌ యూనివర్స్‌ పోటీల్లో నైజీరియాకు చెందిన చిడిమ్మ అడెట్షినా మొదటి రన్నరప్‌గా నిలిచింది. మెక్సికోకు చెందిన మరియా ఫెర్నాండా బెల్‌ట్రాన్‌ రెండో రన్నరప్‌గా నిలిచింది. ఈ మిస్‌ యూనివర్స్‌ 2024 గ్రాండ్‌ ఫినాలేలో భారత్‌కు చెందిన రియా సింఘా కూడా పాల్గొంది. అయితే ఆమె టాప్‌ 30లోనే ఆగిపోయింది. ఈసారి మిస్ యూనివర్స్ పోటీల్లో టాప్-12లో ఏడుగురు లాటిన్ అమెరికా దేశాలకు చెందినవారే.

ప్ర‌దాన వార్త‌లు

రాహుల్ గాంధీని విమర్శించే నైతిక అర్హత కేసీఆర్‌కు లేదన్న జగ్గారెడ్డి వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com