Tuesday, January 7, 2025

విష్ణు మంచు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన కన్నప్ప టీం

మంచు మోహన్ బాబు తనయుడు, టాలీవుడ్‌ డైనమిక్ హీరో విష్ణు మంచు నేడు (నవంబర్ 23) తన 43వ పుట్టిన రోజును జరుపుకుంటున్నారు. సెలబ్రిటీ కిడ్ గా ఇండస్ట్రీ గడప తొక్కిన ఆయన ఎన్నో విలక్షణ పాత్రలు పోషించి తెలుగు చిత్రసీమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవడం గాక, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (MAA) అధ్యక్ష పీఠం దక్కించుకున్నారు. ఈ రోజు విష్ణు మంచు బర్త్ డే సందర్భంగా సినీ లోకంతో పాటు పలువురు టాలీవుడ్ ప్రముఖులు, కన్నప్ప మూవీ యూనిట్ ఆయనకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు చెబుతున్నారు.

చైల్డ్ ఆర్టిస్ట్ గా 1985లో రగిలే గుండెలు సినిమాతో కెమెరా ముందుకొచ్చి విష్ణు మంచు.. చాలా ఏళ్ల తర్వాత 2003లో విష్ణు సినిమాతో హీరోగా పరిచయమయ్యారు. ఈ సినిమాకు గాను ఫిలిం ఫేర్ బెస్ట్ మేల్ డెబ్యుటాంట్ అవార్డు దక్కించుకున్నారు. ఆ తర్వాత వరుసగా.. సూర్యం, పొలిటికల్ రౌడీ, అస్త్రం, గేమ్ సినిమాల్లో నటించారు. ఢీ మూవీ ఆయన కెరీర్ ని మలుపుతిప్పింది.

ఆ తర్వాత దేనికైనా రేడీ, దూసుకెళ్తా, ఈడోరకం ఆడోరకం, లక్కున్నోడు, గాయత్రి, ఆచారి అమెరికా యాత్ర లాంటి సినిమాల్లో విలక్షణ పాత్రలు పోషించారు విష్ణు మంచు. రీసెంట్ గా జిన్నా సినిమాలో డిఫరెంట్ క్యారెక్టర్ చేసిన ఆయన.. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల్లో విజయకేతనం ఎగరేసి టాలీవుడ్ దృష్టిని ఆకర్షించారు.

ప్రస్తుతం తన ఫోకస్ మొత్తం కన్నప్ప సినిమాపై పెట్టారు విష్ణు మంచు. ఇది ఆయన కెరీర్ లోనే ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతోంది. ఇది విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కూడా. వెండితెరను మించిన కొత్త క్రియేటివ్ వెంచర్‌ను ఆవిష్కరిస్తూ ఈ సినిమాను ప్రారంభించారు. ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్న కన్నప్ప సినిమాకు ప్రముఖ హాలీవుడ్ సినిమాటోగ్రాఫర్ షెల్డన్ చౌ, యాక్షన్ డైరెక్టర్ కేచా ఖంఫక్డీ , డ్యాన్స్ మాస్ట్రో ప్రభుదేవా వంటి టాప్ టెక్నీషియన్స్ పని చేస్తున్నారు.

ఇప్పటికే కన్నప్ప మీద భారీ అంచనాలు నెలకొన్నాయి. టీజర్‌తో ఒక్కసారిగా కన్నప్ప టీం హైప్ పెంచేసింది. కన్నప్ప నుంచి ఒక్కో పాత్రను రివీల్ చేస్తూ ఇస్తున్న అప్డేట్లు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. రీసెంట్ గానే మంచు వారి మూడో తరం నుంచి అవ్రామ్ భక్త మంచు లుక్‌ను రిలీజ్ చేసి సర్ ప్రైజ్ చేశారు. విష్ణు మంచు తనయుడు అవ్రామ్ భక్త మంచు కన్నప్ప సినిమాతో తెరపైకి ఎంట్రీ ఇస్తుండటం విశేషం. విష్ణు మంచు టైటిల్ రోల్‌లో కనిపించనున్న ఈ సినిమాను అవా ఎంటర్టైన్మెంట్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్లపై మోహన్ బాబు నిర్మిస్తున్నారు. భారత దేశంలోని నాలుగు మూలల ఉన్న మహా నటుల్ని ఈ చిత్రంలో చూడబోతున్నాం. కన్నప్ప మూవీ ఏ తరానికి అయినా కొత్తగానే ఉంటుందని, సినీ చరిత్రలో కొత్త అధ్యాయాన్ని లిఖిస్తుందని చిత్రయూనిట్ నమ్మకంగా ఉంది.

ప్ర‌దాన వార్త‌లు

గోటితో పోయే దాన్ని గోడ్డ‌లి వ‌ర‌కు తెచ్చారు... బ‌న్నీ అరెస్ట్‌ వివాదంపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ వ్యాఖ్యలను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com