Wednesday, January 1, 2025

కేసీఆరా.. హరీశా..? మొదలైన కాళేశ్వరం కమిషన్ విచారణ

కాళేశ్వరం కమిషన్ విచారణ సోమవారం ఉదయం నుంచి పునఃప్రారంభమైంది. ఇప్పటికే 14 మంది ఇంజినీర్లను జస్టిస్‌ పినాకి చంద్రఘోష్‌ కమిషన్‌ పిలువగా.. కమిషన్‌ ముందు హాజరయ్యారు. గతంలో వారు ఇచ్చిన అఫడవిట్లను పరిశీలిస్తున్న కమిషన్‌.. వాటి ప్రకారం విచారించనుంది. ఈ విచారణలో భాగంగా 14మంది ఇంజినీర్లు కమిషన్ ఎదుటకు వచ్చారు. ఈ నేపథ్యంలోనే సోమవారం నుంచి కాళేశ్వరం కమిషన్ విచారణ ఊపందుకుంది. కొన్నిరోజులుగా ఆగిపోయిన విచారణ పునఃప్రారంభమైంది. విచారణలో భాగంగా డీఈ, ఏఈలు కమిషన్ ఎదుట హాజరయ్యారు. మంగళవారం మరో 14మంది ఇంజినీర్లను కమిషన్ విచారించనుంది. అయితే, ఈసారి విచారణకు మాజీ సీఎం కేసీఆర్‌, మాజీ మంత్రి హరీశ్‌ రావును పిలిచే అవకాశాలున్నాయి. ఇప్పటికే హరీశ్‌రావుకు నోటీసు కూడా అందినట్లు తెలుస్తున్నది.

ప్ర‌దాన వార్త‌లు

గోటితో పోయే దాన్ని గోడ్డ‌లి వ‌ర‌కు తెచ్చారు... బ‌న్నీ అరెస్ట్‌ వివాదంపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ వ్యాఖ్యలను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com