Friday, November 15, 2024

పవిత్రమైన కార్తీక పౌర్ణమి సందర్భంగా మంగినపూడి బీచ్లో పుణ్య స్నానాలు

మచిలీపట్నం నవంబర్ 15: పవిత్రమైన కార్తీక పౌర్ణమి సందర్భంగా మంగినపూడి బీచ్లో పుణ్య స్నానాలు చేసే భక్తుల కోసం అన్ని సౌకర్యాలు కల్పించామని రాష్ట్ర గనులు భూగర్భవనరులు ఎక్సైజ్ శాఖ మంత్రివర్యులు కొల్లు రవీంద్ర పేర్కొన్నారు.

శుక్రవారం తెల్లవారుజామున కార్తీక పౌర్ణమి సందర్భంగా రాష్ట్ర మంత్రివర్యులు మచిలీపట్నం మండలంలోని మంగినపూడి బీచ్ లో సముద్రునికి పూజలు, కర్పూర హారతి నిర్వహించి స్నానమాచరించారు.
అనంతరం మంత్రివర్యులు దారి పొడవునా భక్తులను ఎంతో ఆప్యాయంగా పలకరిస్తూ వారు ఎక్కడి నుంచి వచ్చారు వారి యోగక్షేమలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం తరఫున అన్ని ఏర్పాట్లు చేశామని వాటిని సద్వినియోగం చేసుకోవాలని వారిని కోరారు

ఈ సందర్భంగా మంత్రివర్యులు మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ పవిత్రమైన కార్తీక పౌర్ణమి రోజున దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున భక్తులు నదులు, సముద్రాలలో పుణ్యస్నానాలు ఆచరించి దేవాలయాల్లో పూజలు చేయడం ఆనవాయితీ అన్నారు
ప్రతి సంవత్సరం మచిలీపట్నం మంగినపూడి బీచ్ లో కార్తీక పౌర్ణమి సందర్భంగా లక్షలాదిమంది భక్తులు స్నానమాచరిస్తుంటారన్నారు. వారి సౌకర్యం కోసం రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం తరఫున అన్ని ఏర్పాట్లు చేశామన్నారు.

నగరంలో శ్రీ పాండురంగ స్వామి ఉత్సవాలు జరుగుతున్నాయని రాత్రంతా అక్కడ భక్తులు జాగరణ చేసి ఇక్కడికి వచ్చి స్నానమాచరిస్తుంటారన్నారు. రాకపోకలకు ఇబ్బంది లేకుండా రహదారులన్నీ విద్యుత్ దీపాలు, బారికేడింగ్ ఏర్పాట్లు చేశామన్నారు.

రెవిన్యూ,పోలీసు సిబ్బంది 500 మందికి పైగా ఈరోజు రద్దీ నియంత్రణ చేస్తున్నారని, ఎక్కడ కూడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఏర్పాటు చేశామన్నారు.

అంతేకాకుండా ఫాల్కన్ వాహనాన్ని ఏర్పాటు చేసి డ్రోన్ కెమెరా ద్వారా ఎప్పటికప్పుడు మొత్తం చుట్టుపక్కల ప్రాంతాల్ని వ్యవస్థను అంతటిని పరిశీలిస్తున్నామన్నారు.

మత్స్య శాఖ ద్వారా పడవలు, 60 మందికి పైగా గజఈతగాల్లను ఏర్పాటు చేసి ఏర్పాటు చేశామన్నారు.

నీటి ప్రవాహము, లోతు స్థాయిని బట్టి గుంజలు నాటి తాళ్లు కట్టి భక్తులకు ఆ లోపలే స్నాన ఆచరించే విధంగా అనుమతులు ఇవ్వడం జరిగిందన్నారు.

వచ్చే భక్తులకు జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ, జిల్లా పోలీస్ అధికారి ఆర్ గంగాధర్ రావు, సంయుక్త కలెక్టర్ గీతాంజలి శర్మ గత నాలుగయిదు రోజులు నుంచి రెవెన్యూ, పోలీసు, పారిశుధ్య సిబ్బంది మంగినిపూడి బీచ్ ప్రాంతంలో భక్తులకు కావలసిన అన్ని ఏర్పాట్లు చేశారన్నారు.

దేవాదాయ శాఖ ద్వారా పులిహోర ప్రసాదాలు ఉచితంగా పంపిణీ చేస్తున్నామన్నారు.

అలాగే దాదాపు 1000 లీటర్లకు పైగా పాలను చిన్నపిల్లలకు ఉచితంగా పంపిణీ చేస్తున్నామన్నారు. చిన్న పిల్లలు ఎవరూ కూడా తప్పిపోకుండా ఉండటానికి వారి చేతికి టాగింగ్ ఏర్పాట్లు చేశామన్నారు.

ఈ పవిత్ర కార్యక్రమంలో పాల్గొంటున్న వారందరికీ తన హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు.

అనంతరం మంత్రివర్యులు ఐసిడిఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన శిబిరంలో చిన్న పిల్లల చేతికి ట్యాగులు వేసి పాలను పంపిణీ చేశారు.
.
ఈ కార్యక్రమంలో మంత్రి వెంట జిల్లా పోలీసు అధికారి ఆర్ గంగాధర్ మచిలీపట్నం డిఎస్పి అబ్దుల్ సుభాని మెరైన్ ఎస్ఐ జగదీష్ చంద్రబోస్, జిల్లా గ్రంధాలయ సంస్థ మాజీ చైర్మన్ గొర్రెపాటి గోపీచంద్ పలువురు రెవెన్యూ, పోలీసు సిబ్బంది, తదితర అధికారులు అనధికారులు, గజ ఈతగాళ్లు పాల్గొన్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

బోనస్ ఇచ్చి ధాన్యం కొంటున్నట్టు రేవంత్ రెడ్డి మహారాష్ట్రలో గప్పాలు కొట్టాడు అన్న హరీశ్ రావు వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..!
- Advertisment -

Most Popular