Friday, September 20, 2024

ప్రజలకు అందుబాటులో ఉండి సమస్యలు పరిష్కరిస్తాం

ప్రజలకు అందుబాటులో ఉండి సమస్యలు పరిష్కరిస్తాం
ప్రజా ప్రభుత్వం ప్రతిహామీని నిలబెట్టుకుంటుంది, ఇందులో సందేహం లేదు
పూతలపట్టు నియోజకవర్గం, బంగారుపాళ్యం నా గుండెల్లో ఉంటుంది
ఇక్కడి నుంచే యువగళం పాదయాత్ర దండయాత్రగా మారింది
మిషన్ రాయలసీమతో ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తాం
జగన్ రెడ్డివి అన్ని ఫేక్ ప్రచారాలు
ఎన్.కోటూరు ప్రజావేదిక సభలో మంత్రి నారా లోకేష్
బంగారుపాళ్యం: ప్రజలు మాపై నమ్మకం ఉంచి 164 స్థానాల్లో గెలిపించారని, గత ప్రభుత్వం మాదిరిగా కాకుండా ప్రజలకు అందుబాటులో ఉండి సమస్యలు పరిష్కరిస్తామని విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. బంగారుపాళ్యం మండలం ఎన్. కోటూరులో ప్రజావేదిక నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. గత ప్రభుత్వంలో పరదాలు, బారికేడ్లు పెట్టుకుని తిరిగారు. ప్రజాప్రతినిధులు ఏనాడూ ప్రజలను కలవలేదు. చంద్రబాబు నాయకత్వంలో ప్రజాప్రతినిధులందరూ ప్రజలకు అందుబాటులో ఉండాలని చెప్పారు. 2023 జనవరి 27న నేను యువగళం పాదయాత్ర ప్రారంభించా. కుప్పం నియోజకవర్గం నుంచి పాదయాత్ర ప్రారంభమైంది. 11 జిల్లాలు, 97 నియోజకవర్గాలు, దాదాపు 2వేల గ్రామాలు, 3132 కి.మీల పాదయాత్ర చేశా. అడుగడుగునా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు తెలుసుకున్నా. అవి చూసిన తర్వాతనే చంద్రబాబుతో చర్చించి బాబు సూపర్-6 మేనిఫెస్టో హామీలను రూపొందించడం జరిగింది. మీ లోకేష్ పాదయాత్ర చేస్తుంటే జగన్ రెడ్డి జీవో నెం.1 తీసుకువచ్చి అడుగడుగునా అడ్డుకున్నారు. రోడ్డుపై మీటింగ్ లు పెట్టవద్దంటూ జీవో తీసుకువచ్చారు. నన్ను అడుగడుగునా ఇబ్బందిపెట్టారు. స్టూల్ లాక్కున్నారు. మైక్ లాక్కుని కోర్టులో పెట్టారు. ఇప్పటికీ తిరిగివ్వలేదు. కోర్టులో ఉంది. జీవో నెం.1 మడిచిపెట్టుకోవాలని, ఈ యువగళం ఆగదని జగన్ రెడ్డికి ఆనాడే చెప్పా.
బంగారుపాళ్యంలో యువగళం దండయాత్రగా మారింది
బంగారుపాళ్యం వచ్చిన తర్వాత యువగళం దండయాత్రగా మారింది. బంగారుపాళ్యం క్రాస్ లో ఆనాటి డీఎస్పీ వచ్చి అమరన్నపై దాడి చేశారు. నేను నిలదీస్తే నాపై కేసుపెట్టారు. ఇలా 23 కేసులు నాపై పెట్టారు. తగ్గేదే లేదని ఆనాడే చెప్పా. ఈ రోజు గర్వంగా చెబుతున్నా. అదే బంగారుపాళ్యంలో నిల్చున్నా. ఏ బిల్డింగ్ పై నుంచి నేను మాట్లాడానో అదే బిల్డింగ్ వద్ద సెల్ఫీలు తీసుకున్నా. బంగారుపాళ్యాన్ని నేను ఎప్పటికీ మర్చిపోను. ఆనాడు ఇచ్చిన హామీలు నెరవేరుస్తాం. డయాలసిస్ సెంటర్ కావాలని ప్రజలు కోరితే వంద రోజుల్లో హామీని నిలబెట్టుకున్నా. ఐదు పడకలతో డయాలసిస్ సెంటర్ మన ప్రభుత్వం మీకోసం ఏర్పాటుచేసింది. ఇందుకోసం రూ.3 కోట్లు ఖర్చు చేశాం. 43 ఏళ్ల వ్యక్తి డయాలసిస్ చేయించుకుంటున్నారు. దీనిపై చర్యలు చేపడతాం. నీరు కలుషితం కాకుండా చూస్తాం. ప్రతి ఇంటికి సురక్షిత తాగునీరు అందిస్తాం. పనులు కూడా త్వరలో ప్రారంభిస్తాం.
జగన్ రెడ్డివి అన్ని ఫేక్ ప్రచారాలు
విజయవాడకు వచ్చిన వరదల్లో చంద్రబాబు కుర్రోడిలా జేసీబీలు ఎక్కి ప్రజలను ఆదుకున్నారు. జగన్ రెడ్డి మాత్రం విమర్శలు చేస్తున్నారు. ఫేక్ జగన్ లా మారారు. మెగా డీఎస్సీ ఏర్పాటుచేస్తానని చెప్పి, సంపూర్ణ మద్యపాన నిషేధం అంటూ జగన్ రెడ్డి మాటతప్పారు. రాజారెడ్డి రాజ్యాంగంతో ప్రజలను ఇబ్బంది పెట్టారు. ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పద్ధతి ప్రకారం హామీలు అమలు చేస్తున్నాం. పెన్షన్ ను రూ.3వేల నుంచి రూ.4వేలు చేశాం. జగన్ రెడ్డి వెయ్యి పెన్షన్ పెంచడానికి ఐదేళ్లు పట్టింది. దివ్యాంగులకు మేం రూ.3వేల నుంచి రూ.6వేల వరకు పెన్షన్ పెంచాం. పూర్తి అంగవైకల్యం ఉన్నవారికి రూ.15వేలు చేశాం. యువతకు ఉద్యోగాల కల్పన కోసం చంద్రబాబు తొలి సంతకం మెగా డీఎస్సీపై పెట్టారు. ఇప్పటికే అనేక పరిశ్రమలు తీసుకువచ్చారు. ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ను రద్దు చేసి ప్రజల ఆస్తులకు రక్షణగా ఉన్నారు.
మిషన్ రాయలసీమతో ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తాం
మిషన్ రాయలసీమ ప్రకటించాం. పిల్లలు చదువుకునేందుకు పాఠశాలలు, విశ్వవిద్యాలయాలు తీసుకువస్తాం. మన ప్రాంతంలోనే ఉద్యోగాలు కల్పిస్తాం. రైతులకు సబ్సీడీపై డ్రిప్ పరికరాలు అందజేస్తాం. త్వరలోనే కార్యాచరణ ప్రకటిస్తాం. పేదల ఆకలి తీర్చే అన్న క్యాంటీన్ ను జగన్ రెడ్డి రద్దు చేశారు. మేం వంద రోజుల్లోనే అన్న క్యాంటీన్లు తిరిగి ప్రారంభించాం.
ప్రతి హామీని ప్రజాప్రభుత్వం నిలబెట్టుకుంటుంది
ప్రకాశం బ్యారేజీలో పడవలు వదిలి లంక గ్రామాలను ముంచాలని చూశారు. జగన్ రెడ్డి అడుగడుగునా కుట్రలు చేస్తున్నారు. సొంత బాబాయిని చంపి నింద చంద్రబాబుపై వేశారు. పింక్ డైమండ్ పేరుతో మాపై దుష్ప్రచారం చేశారు. తిరుమల లడ్డూలో నాణ్యత లేకుండా చేశారు. నిత్యాన్నదానం నాసిరకంగా చేశారు. చంద్రబాబు వచ్చిన వెంటనే టీటీడీ ప్రక్షాళనకు నడుం బిగించారు. తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు కలిపారు. వైవీ సుబ్బారెడ్డి అవినీతి కోసం ఇదంతా చేశారు. దేవుడితో పెట్టుకున్నారు. 175 నియోజకవర్గాల్లో 164 స్థానాలు ఎన్డీయేకు అప్పగించారు. బాధ్యతతో వ్యవహరిస్తాం. గత ప్రభుత్వం మాదిరిగా ప్రవర్తించం. ప్రజలకు అందుబాటులో ఉండి సమస్యలు పరిష్కరిస్తాం. ప్రతి హామీని మన ప్రభుత్వం నిలబెట్టుకుంటుంది. ఇందులో ఎలాంటి సందేహం లేదు. ఐదేళ్లలో ఎన్ని కష్టాలు పడ్డామో చూశాం. నిత్యావసర ధరలు ఆనాడు పెంచారు. పద్ధతి ప్రకారం అన్నీ చేస్తున్నాం. నిత్యావసర ధరలు తగ్గిస్తాం.
పూతలపట్టు, బంగారుపాళ్యంను అభివృద్ధి చేస్తాం
పూతలపట్టు నియోజకవర్గం, బంగారుపాళ్యం నా గుండెల్లో ఉంటుంది. నాపైన డీఎస్పీ దాడిచేస్తే, లాఠీ, స్టూల్ లాక్కుంటే ఇక్కడి ప్రజలే అండగా నిలిచారు. జీవో నెం.1 ద్వారా లాఠీఛార్జి చేయాలని చూశారు. కానిస్టేబుళ్లు కూడా సహాయనిరాకరణ చేశారు. బంగారుపాళ్యం నుంచి పాదయాత్ర దండయాత్రగా మారి విశాఖ వరకు చేరింది. పూతలపట్టు నియోజకవర్గాన్ని, బంగారుపాళ్యాన్ని అభివృద్ధి చేస్తా.
ప్రశ్నలు-సమాధానాలు
ప్రజావేదిక కార్యక్రమంలో కార్యక్రమంలో పాల్గొన్న ప్రజలు తాము ఎదుర్కొంటున్న సమస్యలను విన్నవించడంతో పాటు మంత్రి నారా లోకేష్ ను పలు ప్రశ్నలు అడిగారు. ఆయన సమాధానం చెప్పారు.
వీరరాఘవుల నాయుడు, సదకుప్పం గ్రామం 
నారా లోకేష్ పాదయాత్రను దిగ్విజయంగా పూర్తిచేశారు. ప్రతి వంద కి.మీలకు ఓ హామీ ఇచ్చారు. అందులో భాగంగానే బంగారుపాళ్యంలో డయాలసిస్ కేంద్రాన్ని వంద రోజుల్లో ఏర్పాటుచేశారు. అదేవిధంగా అన్ని హామీలు నెరవేరుస్తారా?
మంత్రి నారా లోకేష్: డయాలసిస్ సెంటర్ హామీని నెరవేర్చుకున్నాం. ప్రతి హామీని ఇదేవిధంగా నెరవేరుస్తాం. గతంలో డయాలసిస్ సెంటర్ లేనప్పుడు ప్రజలు సుదూర ప్రాంతాలకు వెళ్లేవారు. ఇప్పుడు దానికి ఫుల్ స్టాప్ పెట్టాం.
వైష్ణవి, బంగారుపాళ్యం
ప్రతి ఏటా జాబ్ కేలండర్ ఇస్తామని చెప్పారు. మొదటి జాబ్ కేలండర్ ఎప్పుడు ఇస్తారు? జగన్ మళ్లీ వస్తాడని పారిశ్రామిక వేత్తలు భయపడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రైవేటు జాబ్ లు సాధ్యమా?
మంత్రి నారా లోకేష్: బాబుగారు చేసిన ఐదు సంతకాల్లో ఒక సంతకం డీఎస్సీ ద్వారా 16,400 పోస్టుల భర్తీ చేసేందుకు తొలి అడుగు వేశాం. జనవరికి జాబ్ కేలండర్ ఇస్తాం. యూనిఫైడ్ పోర్టల్ తీసుకువస్తాం. ఖాళీలన్నీ పద్ధతి ప్రకారం భర్త చేస్తాం. బాబుగారు అంటే బ్రాండ్. దీంతో పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు ఏపీకి వస్తున్నారు. టాటా సంస్థ ఛైర్మన్ బాబుగారితో ముఖాముఖి కలిశారు. 20 లక్షల ఉద్యోగాలు తప్పకుండా కల్పిస్తాం. ఎన్నాళ్లు పొరుగు రాష్టాలకు వెళ్తాం. పొరుగు రాష్ట్రాలవారే ఇక్కడికి వచ్చేలా చేస్తాం. జగన్ రెడ్డికి ప్రజలు తగిన గుణపాఠం చెప్పారు. వచ్చే ఎన్నికల్లో కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే చాలా నష్టోయాం.
గ్రీష్మ, బంగారుపాళ్యం
కాదంబరి జత్వాని విషయంలో గత ప్రభుత్వం దారుణంగా వ్యవహరించింది. దీనిపై ఏం చర్యలు తీసుకుంటారు? ప్రతి మహిళకు భద్రత కల్పించేందుకు ఏం చేస్తారు?
మంత్రి నారా లోకేష్: కేజీ నుంచి పీజీ వరకు కరిక్యులమ్ బలోపేతం చేసి మహిళలను గౌరవించేలా చేస్తాం. వచ్చే ఏడాది నుంచి ప్రారంభిస్తాం. మహిళల రక్షణకు కట్టుబడి ఉన్నాం. ఇప్పటికే ముగ్గురు ఐపీఎస్ లను సస్పెండ్ చేశాం. తప్పుచేసిన వారిని వదిలిపెట్టం.
వరుణ్, కాకర్లవారిపల్లి, కాణిపాకం
చిత్తూరుకు ఎలాంటి పరిశ్రమలు తీసుకువస్తారు?
మంత్రి నారా లోకేష్: గతంలో చంద్రబాబునాయుడు గారు ఎలక్ట్రానిక్ మానుఫ్యాక్చరింగ్ పరిశ్రమలు తీసుకువచ్చారు. ఎలక్ట్రానిక్స్ రంగంలో చిత్తూరును దేశం, ప్రపంచంలోనే నెం.1గా రూపుదిద్దుతాం. ఇప్పటికే అనేక మందితో నేను మాట్లాడా. గత ప్రభుత్వ వైఖరి వల్ల కొంత వెనకడుగు వేస్తున్నారు. బతిమిలాడైనా వారిని తీసుకువస్తా. కేంద్రంలో కూడా మోడీ గారు ఏపీపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. ఏపీలో పెట్టుబడులు పెట్టాలని చెబుతున్నారు. మోడీ-బాబు జోడి అభివృద్ధి ట్రైన్ ను స్పీడ్ గా పట్టాలెక్కిస్తారు.
***

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

ప్రకాశం బ్యారేజీని బోట్లు ఢీకొట్టడం కుట్రే... ఇందులో జ‌గ‌న్ పాత్ర ఉంది అన్న వర్ల రామయ్య వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular