న్యూఢిల్లీ: రాజ్యసభకు కొత్తగా ఎన్నికైన సభ్యులు ఇవాళ బాధ్యతలు చేపట్టారు. బుధవారం ఉదయం ఉప రాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్‌ఖర్ కొత్త సభ్యులతో ప్రమాణం చేయించారు. కేంద్ర సమాచార, ప్రసార శాఖ సహాయ మంత్రి ఎల్. మురుగన్, ఆర్జేడీ నేత మనోజ్ కుమార్ ఝా సహా మొత్తం 12 మంది సభ్యులు పెద్దల సభకు ఇవాళ ప్రమాణ స్వీకారం చేశారు.
కొత్తగా ప్రమాణ స్వీకారం చేసిన వారు..
– ఎల్. మురుగన్
– ధర్మశీల గుప్తా
– మనోజ్ కుమార్ ఝా
– సంజయ్ యాదవ్
– గోవింద్‌భాయ్ లాల్జీభాయ్ ధోలాకియా
– సుభాష్ చందర్
– హర్ష్ మహాజన్
– జీసీ చంద్రశేఖర్
– అశోక్ సింగ్ చంద్రకాంత్
– హండోరే మేధా
– విశ్రమ్ కులకర్ణ
– సాధన సింగ్..