Monday, May 20, 2024

మెదక్​ లో కాంగ్రెస్ జెండా ఎగరాలి..!

  • మెదక్​ లో కాంగ్రెస్ జెండా ఎగరాలి..!
  • మెదక్ పార్లమెంట్ సమీక్ష సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి

టీఎస్​, న్యూస్​ :పార్లమెంట్​ ఎన్నికల్లో మెదక్​ లో కాంగ్రెస్​ గెలుపు పార్టీకి అత్యంత ప్రతిష్టాత్మకమని సీఎం రేవంత్​ రెడ్డి పేర్కొన్నారు. అక్కడ కాంగ్రెస్ జెండా ఎగురవేయడమే లక్ష్యంగా కలిసికట్టుగా పనిచేయాలని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, ఇంఛార్జీలు, పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ పని అయిపోయిందన్న సీఎం.. బీజేపీ పరిస్థితి అంతంతమాత్రంగానే ఉందన్నారు. ఇదే అదనుగా నాయకత్వమంతా కలిసికట్టుగా పనిచేసి మెదక్ సీటును కాంగ్రెస్ ఖాతాలో వేసుకునే విధంగా కృషి చేయాలన్నారు. బుధవారం హైదరాబాద్​ లోని జూబ్లీహిల్స్ లో తన నివాసంలో సీఎం మెదక్ పార్లమెంట్ నియోజకవర్గ స్ధాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ ఇందిరా గాంధీ ప్రాతినిధ్యం వహించిన మెదక్ పార్లమెంట్ స్థానం తమకు ప్రతిష్టాత్మకమని ఈ స్థానంలో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకువచ్చి గెలిపించాలని సూచించారు.

కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్న ఆరు గ్యారంటీలతో ప్రజల్లో పార్టీ పట్ల సానుభూతి పెరిగిందన్నారు. ఈ పథకాలే ప్రచారంలో ప్రచారస్త్రాలుగా వినియోగించుకొని విజయం సాధించేలా కృషి చేయాలన్నారు. మెదక్ పార్లమెంటు పరిధిలోని ఎమ్మెల్యేలతో పాటు మాజీ ఎమ్మెల్యేలు నియోజకవర్గ ఇన్చార్జిలు ఎప్పటికప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలతో సమన్వయం చేసుకుంటూ ప్రజలను చైతన్యవంతం చేస్తూ కాంగ్రెస్ పార్టీకి ఓటేసేలా చూడాలని కోరారు. ఈ సమావేశానికి మంత్రులు దామోదర రాజనర్సింహ, కొండా సురేఖ, ఎమ్మెల్యే రోహిత్, మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు తో పాటు మెదక్ పార్లమెంట్ పరిధిలోని పఠాన్ చెరు ,నర్సాపూర్, దుబ్బాక, సిద్దిపేట నియోజకవర్గ ఇన్చార్జిలు కాటా శ్రీనివాస్ గౌడ్,రాజిరెడ్డి, చెరుకు శ్రీనివాస్ రెడ్డి ,పూజాల హరికృష్ణ, టీఎస్​ఐఐసీ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి, మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి పాల్గొన్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

బీజేపీ స‌ర్కార్ తెలంగాణ‌లో కాంగ్రెస్ ప్ర‌భుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర‌ జ‌రుపుతుందా?

Most Popular