Sunday, November 17, 2024

4వేల కోట్లతో భారత్ లో ప్రపంచంలోనే అతి పెద్ద షాపింగ్ మాల్

ప్రపంచంలోనే అతి పెద్ద హైపర్ మార్కెట్ చైన్ సంస్థ లులు గ్రూప్ ఒక కీలక ప్రకటన చేసింది. దేశంలోనే అతిపెద్ద షాపింగ్ మాల్‌ను సుమారు 4 వేల కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్నట్లు ప్రకటించింది. గుజరాత్ లోని అహ్మదాబాద్‌లో దేశంలోనే అతిపెద్ద షాపింగ్ మాల్ నిర్మించేందుకు ప్రణాళికలు సిద్దం చేశామని లులు గ్రూప్ ఇంటర్నేషనల్ ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎంఏ యూసుఫ్ అలీ చెప్పారు. ఈ ఏడాదిలోనే షాపింగ్ మాల్ కు సంబందించిన పనులు ప్రారంభం అవుతాయని ఆయన ప్రకటించారు.

అహ్మదాబాద్‌ లో దేశంలోనే అతిపెద్ద షాపింగ్ మాల్ ను నిర్మించబోతున్నామని చెప్పిన యూసూఫ్ అలీ.. ఇప్పటికే ఇక్కడ ల్యాండ్ కూడా లభించిందన్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి తమకు పూర్తి మద్దతు ఉందని చెప్పుకొచ్చారు. అహ్మదాబాద్ లో ప్రారంభించబోతున్న అతిపెద్ద షాపింగ్ మాల్ ప్రాజెక్టు సుమారు 3,50,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించనున్నారు. దాదాపు 3 వేల మంది వరకు ఉపాధి అవకాశాలు కల్పించనున్నట్లు యూసుఫ్ అలీ తెలిపారు.

దుబాయ్ కేంద్రంగా హైపర్‌ మార్కెట్స్, రిటైల్ కంపెనీస్ చెయిన్లను నిర్వహిస్తోంది లులు గ్రూప్. దేశంలోని పలు ప్రధాన నగరాల్లో ఈ లులు మాల్స్‌ను లాంఛ్ చేసింది. ఇప్పటికే కొచ్చి, బెంగళూరు, కోయంబత్తూరు, లక్నో, తిరువనంతపురం, హైదరాబాద్‌ తో కలిపి 6 మాల్స్ ఉన్నాయి. హైదరాబాద్ లో గత సంవత్సరం 300 కోట్ల రూాపాయలతో లులు మాల్ ప్రారంభించింది. కూకట్ పల్లి హౌజింగ్ బోర్డ్ లోని మంజీరా మాల్‌ ను రీబ్రాండింగ్ చేసి లులు మాల్‌గా తీర్చిదిద్దడంతో హైదరాబాద్ వాసులు అంతర్జాతీయ స్థాయి షాపింగ్ అనుభవాల్ని పొందుతున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

బోనస్ ఇచ్చి ధాన్యం కొంటున్నట్టు రేవంత్ రెడ్డి మహారాష్ట్రలో గప్పాలు కొట్టాడు అన్న హరీశ్ రావు వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..!
- Advertisment -

Most Popular